పవర్ స్టార్ కు వెంకటేష్ గెస్ట్.. త్రివిక్రం అదిరే ప్లాన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే సీనియర్ నటి ఖుష్బు పవన్ కు అత్తగా నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు మరో సూపర్ స్టార్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ పవన్ సినిమాలో గెస్ట్ రోల్ ఇస్తున్న హీరో ఎవరు అంటే విక్టరీ వెంకటేష్ అని అంటున్నారు.

గోపాలా గోపాల సినిమాలో వెంకటేష్, పవన్ కలిసి నటించారు ఆ తర్వాత మళ్లీ పవన్ తో వెంకటేష్ స్క్రీన్ చేసుకోబోతున్నాడు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలకు మాటలందించిన త్రివిక్రం చాలా గ్యాప్ తర్వాత వెంకటేష్ తో చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇక పవర్ స్టార్ తో త్రివిక్రం జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

అత్తారింటికి దారేది తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు రెండు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేదు. అందుకే త్రివిక్రం తో మరోసారి తన రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సినిమా హిట్ స్కెచ్ లో భాంగంగా వెంకటేష్ కేమియో ప్లాన్ వేశాడట త్రివిక్రం మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Comments

comments