పవన్, మహేష్, ఎన్టీఆర్ సినిమాల నైజాం రైట్స్ దిల్ రాజు ఎంతకు కొన్నాడంటే….?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్……ముగ్గురూ కూడా ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ముగ్గురూ కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్సే….అలాగే భారీ అంచనాల మధ్య రెడీ అవుతున్నాయి. మరి ఈ మూడు సినిమాల మార్కెట్స్ రేట్స్‌ని పరిశీలిస్తే ఈ స్టార్స్ స్టార్ వ్యాల్యూ ఎంతో ఒక అంచనాకు రావొచ్చు. దాదాపుగా దశాబ్ధంపైగానే టాలీవుడ్ నంబర్ ఒన్ హీరో అని చెప్పి ఈ ముగ్గురి పేర్లూ ప్రస్తావనకు తీసుకురావడం మీడియాకు అలవాటు. మరి ఇప్పుడు ఈ ముగ్గురి సినిమాల నైజాం రైట్స్‌ని దిల్ రాజు కొనబోతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్‌ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను 25 కోట్లకు కొనేశాడు దిల్ రాజు. ఆల్రెడీ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశాడు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న స్పైడర్‌కి ఉన్న నైజాం మార్కెట్ అది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్‌ల సినిమాను 30 కోట్లకు కొనబోతున్నాడు దిల్ రాజు. ఇంచుమించుగా మాటలు అయిపోయాయని తెలుస్తోంది. అత్తారంటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమాకు దిల్ రాజు కట్టిన రేటు అది. ఇక టెంపర్ సినిమా నుంచీ వరుసగా హిట్స్ కొడుతున్న ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ సినిమాను 20-25 కోట్ల మధ్యలో కొనాలన్న ప్రయత్నంలో ఉన్నాడు దిల్ రాజు. కళ్యాణ్ రామ్‌తో బేరం తెగ్గొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ముగ్గురు స్టార్ హీరోల స్టామినా ఈ లెక్కలు, అంకెల్లోనే తేలిపోదు. మహేష్‌బాబు సినిమా మురుగదాస్‌లాంటి ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న డైరెక్టర్ డైరెక్షన్‌లో వస్తోంది. అలాగే పవన్ సినిమా ‘అ..ఆ’ లాంటి చిన్న సినిమాతో కూడా యాభై కోట్ల కలెక్షన్స్ సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వస్తోంది. ఇక ఈ మూడు సినిమాల్లోకి ఎన్టీఆర్ సినిమా డైరెక్టర్ మాత్రం బాగా వీక్. సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో వస్తోంది. సో…..ఇప్పుడు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుంటే బాక్స్ ఆఫీస్ స్టామినా వరకూ మాత్రం ఏ హీరో నంబర్ ఒన్, ఎవరు నంబర్ 2, థర్డ్ నంబర్ ఎవరిది అనే విషయంలో మాత్రం ఓ స్పష్టతకు రావొచ్చేమో.

More from my site

Comments

comments