పవన్, మహేష్ మధ్యలో ఇరుక్కున్న చరణ్

రామ్‌ చరణ్‌ కొత్త సినిమాని దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారు కానీ ముందుగా దసరా బరిలోకి దిగిన ‘స్పైడర్‌’ వల్ల ప్లాన్స్‌ మార్చుకోవాల్సి వస్తుంది. దసరా సీజన్లో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలై విజయవంతం కావడం చాలా అరుదు కనుక ఈ భారీ బడ్జెట్‌ చిత్రంతో పోటీకి చరణ్‌, సుకుమార్‌ల చిత్ర నిర్మాతలు సాహసించకపోవచ్చు.

దసరా మిస్‌ అయితే నెక్స్‌ట్‌ బెస్ట్‌ సీజన్‌ సంక్రాంతి. కానీ ఈసారి సంక్రాంతికి పవన్‌కళ్యాణ్‌ సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట్లో దసరాకి విడుదల చేద్దామని అనుకున్నారు కానీ ఈ చిత్రానికి జరుగుతోన్న బిజినెస్‌ని దృష్టిలో వుంచుకుని హడావిడి పడడం దేనికని సంక్రాంతికి పవన్‌25ని వాయిదా వేసినట్టు అనధికారిక వార్తలు వస్తున్నాయి. చూస్తూ, చూస్తూ బాబాయ్‌తో పోటీకి వెళ్లలేడు కాబట్టి మరోసారి డిసెంబర్‌లోనే ఈ చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చేలా వుంది.

More from my site

Comments

comments