ప్రోటోకాల్ పై పవన్ సీరియస్

ఎన్టీవీ చౌదరి కుమార్తె పెళ్లి రిసెప్షన్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చేదు అనుభవం ఎదురైంది. నిన్న ఎన్టీవీ చౌదరి ఏకైక కుమార్తె వివాహం సందర్భంగా తనకు ప్రోటోకాల్ విషయంలో అవమానం జరిగిందని వివాహానికి హాజరు కాకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. తెలిసిన సమాచారం ప్రకారం దేశం నలుమూలల నుంచి హేమాహేమీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. గవర్నర్, సిఎమ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరై, చాలా సేపు అక్కడే వుండి వధూవరులను ఆశీర్వదించారు. పవన్ కి జరిగిన విషయంలో ఆహ్వానితుల తప్పేమీ లేదు. పవన్ వచ్చిన టైమ్ లోనే సిఎమ్ కూడా వచ్చారు. సిఎమ్ కాన్వాయ్ ముందు ఎవరైతే ఏమిటి? సెక్యూరిటీ ప్రోటోకాల్ అంటూ ఒకటి వుంటుంది. అది గమనించకుండా, సిఎమ్ వస్తే, తనను ఆపుతారా? అని అసహనంతో అలిగి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్యణ వేదిక లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

 

More from my site

Comments

comments