పవన్-త్రివిక్రమ్ సినిమా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ : ఫుల్ జోష్ లో పవన్ సేన

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి సంబందించిన ఏదో ఒక విశేషం ఆగష్టు 15 న ఉంటుందని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూశారు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ గాని పవన్ కళ్యాణ్ గాని అలాంటిదేం లేదంటూ లైట్ తీసుకున్నారు. కాకపోతే పవన్ – త్రివిక్రమ్ COMBO లో తెరకెక్కుతున్న ఫిలిం టైటిల్ గానీ, ఫస్ట్ లుక్ గాని సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేస్తారనే ప్రచారమైతే జోరుగా సాగుతుంది. మరి సెప్టెంబర్ 2 న ఎలాంటి శుభవార్తని పవన్ ఫ్యాన్స్ కి చేరవేస్తుందో గాని పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ న్యూ మూవీ కి సంబందించిన న్యూస్ ఏం తెలియక అయోమయ స్థితిలో వున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున టైటిల్ గాని, ఫస్ట్ లుక్ గాని విడుదల చేస్తారో లేదో అధికారిక సమాచారమైతే లేదుగాని పుట్టిన రోజు వేడుకలు పూర్తవ్వగానే పవన్ కళ్యాణ్ అండ్ మూవీ టీమ్ మొత్తం సినిమా షూటింగ్ కోసం యూరోప్ చెక్కేస్తున్నారట. ఇకపోతే త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జల్సాలో, అత్తారింటికి దారేదిలో పవన్ స్టయిల్ ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మూవీలో పవన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలియక ఫాన్స్ ఇదైపోతున్న టైం లో ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన పవన్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో లీకైంది.

పవన్ కళ్యాణ్ తన 25 వ చిత్రంలో ఎలా ఉంటాడో అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ లీక్ అయిన పిక్ లో పవన్ స్టయిల్ కి పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అలా చూస్తూ మెడలో కండువాతో వెరైటీ డ్రెస్ లో స్టైలిష్ గా కనబడుతున్నాడు. మరి పవన్ లుక్ సినిమాలో ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటీ పవన్ ఫ్యాన్స్ లో ఈ PIC చూశాక కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఇక పవన్ న్యూ లుక్ తో సెప్టెంబర్ 2 న ఎలా కనిపిస్తాడో అని ఎదురు చూడడానికి రెడీ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ నటిస్తుండగా…. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from my site

Comments

comments