బాహుబలి-3.. అయ్యబాబోయ్ అనేస్తున్న ప్రభాస్..!

దగ్గుబాటి రానా స్మాల్ స్క్రీన్ మీద హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రోగ్రాం ‘నెంబర్ 1 యారి’. జెమిని టివిలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం టీజర్ రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్ దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా వచ్చేలా చేశారు. ఈ క్రమంలో రానా రాజమౌళిల మధ్య జరిగిన సంభాషణలు అందరిని ఆకట్టుకున్నాయి.

ప్రోగ్రాంలో సరదా అనిపించిన సన్నివేశం ఏంటంటే షోలో ఉండగానే ప్రభాస్ కు కాల్ చేసి ఓసారి కలవాలంటాడు రాజమౌళి. ఎందుకని ప్రభాస్ అడుగగా బాహుబలి-3 తీద్దామని అంటే వెంటనే ప్రభాస్ ‘అమ్మ.. నీ.. య..’ అంటూ గట్టిగా అనడం ఈ ప్రోగ్రాం టీజర్ కే అది హైలెట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే బాహుబలి కోసం ఐదేళ్ళు కెరియర్ త్యాగం చేసిన ప్రభాస్ మళ్ళీ బాహుబలి పార్ట్ 3 అనగానే ఇచ్చిన రియాక్షన్ అందరికి షాక్ ఇచ్చింది. జూన్ 25న మొదటి ఎపిసోడ్ ప్రసారమవుతుంది. రానా హోస్ట్ గా ఎంతో భారీ తనంతో నెంబర్ 1 యారి షో రాబోతుంది.

ఇక షోలో భాగంగా జక్కన్న చేత విల్లు పట్టించాడు రానా.. వేసిన మూడు నాలుగు బాణాలు టార్గెట్ మిస్ అయినా పవన్ కళ్యాణ్ అనగానే టార్గెట్ కు కరెక్ట్ గా బాణం వేస్తాడు రాజమౌళి. సరదా సరదాగా సాగే ఈ కార్యక్రమంలో తన దర్శకుడితో భళ్లాలదేవ చేసిన సందడి ఎలా ఉంటుందో ఈ ఆదివారం చూడాలి.

https://youtu.be/0xq6hC3ziQQ

More from my site

Comments

comments