తెలుగోడి సత్తా… ఏపి, తెలంగాణాలో… ఐదు రోజుల్లోనే వంద కోట్ల షేర్

ఇప్పటి వరకూ రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నింటిలోనూ బాహుబలి సినిమాను పక్కన పెడితే వంద కోట్లు టచ్ చేసిన వేరే సినిమా లేదు. అసలు ఒక తెలుగు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల షేర్ సాధించడమంటే మాటలు కాదు. బాహుబలి సినిమాకు ముందు అయితే ఎవరూ నమ్మేవాళ్ళు కూడా కాదు. కానీ రాజమౌళి నమ్మాడు. ప్రొడ్యూసర్స్‌ని, ప్రభాస్‌ని నమ్మించాడు.

ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లో రిజల్ట్ సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ఇంచుమించుగా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దశకు వచ్చింది బాహుబలి-2. ఇంకో ఇరవై కోట్ల కలెక్షన్స్ వస్తే చాలు…..ఇక ఆ తర్వాత వచ్చేవన్నీ లాభాలే. ఇప్పటికే ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, హీరో కూడా భారీగా లాభాలు చేసుకున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే స్థాయిలో లాభాల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నుంచీ ఈ సినిమా సాధించే కలెక్షన్స్‌ని బట్టి అసలు బాహుబలి-2 సినిమా ఏ స్థాయి హిట్ అవుతుంది? బాహుబలి-2 సాధించబోయే రికార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయి? భవిష్యత్‌లో రాబోయే సినిమా బాహుబలి రికార్స్డ్‌ని బ్రేక్ చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అనే విషయాలు తెలుస్తాయి.

Comments

comments