సాహో సినిమాలో ప్రభాస్ లుక్ అమేజింగ్.

బహుబలి సినిమాతో నేషనల్ లెవెల్ హీరో అయిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా కోలీవుడ్ లో కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం చాలా ఆతృతగాఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ తన కొత్త లుక్ తో ఉన్న ఫొటోను రిలీజ్ చేశాడు.

కూల్ గా ఉన్న లుక్ లో ప్రభాస్ ని చూస్తుంటే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ప్రభాస్ లుక్ లోచాలా హ్యాండ్సమ్ గా ఉన్నడని ముఖ్యంగా ప్రభాస్ స్మైల్ చాలా లవ్లీగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఈ సినిమాలోని లుక్ అయ్యి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రభాస్ కి జోడిగా కనిపించనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్ర యూనిట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది.

More from my site

Comments

comments