షాక్…..ప్రభాస్ ‘సాహో’ టీజర్ లీక్

prabhas-saho-teaser-leak

బాహుబలి…ది కంక్లూజన్ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అన్న ట్రేడ్ పండిట్స్ అంచనాలతో పిచ్చ హ్యాపీగా ఉన్న ప్రభాస్‌కి షాక్. బాహుబలి తర్వాత సినిమాగా ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా టీజర్ స్టోరీ లీక్ అయింది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన ప్రభాస్‌కి చాలా హోప్స్ ఉన్నాయి. బాహుబలి-2 ప్రమోషన్స్ టైంలో కూడా సాహో గురించి కూడా గట్టిగానే చెప్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా టీజర్‌ని బాహుబలి-2తో పాటే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. ఆ దెబ్బతో సాహోకి బాహుబలి క్రేజ్ పూర్తిగా ఉపయోగడాలన్నది ఐడియా. అయితే ఇప్పుడు ఆ టీజర్ స్టోరీ కాస్తా లీక్ అయింది.

ఈ సినిమా అంతా కూడా జేమ్స్‌బాండ్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ పోలీస్‌గా కనిపించబోతున్నాడు. కంప్లీట్ క్లాస్ యాక్షన్ సెబ్జెక్ట్ అన్నమాట. ఇక ఈ సాహో టీజర్ ఏంటంటే………నలుగురు అమ్మాయిలు నేల మీద పడి ఉంటారు. ఆ అమ్మాయిల నుంచి అలా కెమేరా పాన్ చేస్తే భారీ భారీ బిల్టింగ్స్….లావిష్ రోడ్స్ మీదుగా హీరో కంటిలోకి ఎంటర్ అవుతుంది. రివీల్ చేస్తే జేమ్స్ బాండ్ స్థాయి బిల్డప్‌తో హీరో రివీల్. ఆ అమ్మాయిలున్న లొకేషన్‌లోనే హీరో ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన విలన్…‘ఇంత రక్తం చూస్తుంటే మనవాళ్ళు వీడిని బాగానే కొట్టినట్టుందే…..’ అన్న డైలాగ్ చెప్తాడు. ‘ఆ రక్తం మనవాళ్ళు కొడితే వచ్చింది కాదు సార్…..వాడు మనవాళ్ళను కొడితే వచ్చింది….’ అని విలన్ మనిషి విలన్‌తో చెప్తాడు. అప్పడు రక్తం తుడుచుకుంటూ లేస్తాడు హీరో. ‘ది గేమ్ స్టార్ట్స్ నౌ’ అన్న పంచ్ డైలాగ్ చెప్తాడు. ఆ వెంటనే అతని రెండు చేతులకు రెండు విమానపు గాడ్జెట్స్ లాంటివి వస్తాయి. ఆ తర్వాత అక్కడే ఉన్న ఎత్తైన బిల్టింగ్ పై నుంచి హీరోయిక్‌గా జంపింగ్స్ చేస్తాడు.

ఇదే టీజర్ కాన్సెప్ట్. అయితే ఇంత సింపుల్‌గా ఉందేంటి అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ టీజర్‌లో గ్రాఫిక్స్ వర్క్ మామూలుగా ఉండదట. ఇంచుమించుగా జేమ్స్ బాండ్ తరహా సిినిమాల స్టైల్‌లో ఉంటుందని తెలుస్తోంది. సినిమా అంతా కూడా అదే రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో….హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ వర్క్‌తో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా సాహో ప్రభాస్ అనే స్థాయిలోనే ఉంటుందట.

Comments

comments