బాలయ్య-పూరీ సినిమా…..వామ్మో…..దిమ్మతిరిగే న్యూస్

సినిమా ఇండస్ట్రీలో సక్సెసే అన్నింటికీ ప్రామాణికం. అఫ్కోర్స్ మిగతా అన్ని ఇండస్ట్రీ‌స్‌లో కూడా అన్ని విషయాలూ కూడా సక్సెస్‌తోనే రిలేట్ అయి ఉంటాయనుకోండి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క హిట్ సినిమాని తలరాతలను పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి. అలాంటి సిినిమా ఇండస్ట్రీలో కూడా హిట్స్-ఫ్లాప్స్‌కి సంబంధం లేకుండా కొందరి పయనం ఉంటుంది. అలాంటి అరుదైన టెక్నీషియన్ పూరీ. సొంత కథతో పూరీ ఎప్పుడు హిట్ కొట్టాడో కూడా ఎవరికీ గుర్తులేదు. ఇక వక్కంతం వంశీ కథతో, ఎన్టీఆర్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌తో టెంపర్ సినిమాను మాత్రం హిట్ చేశాడు. ఆ తర్వాత నుంచీ మళ్ళీ మామూలే. అన్నీ ఫ్లాపులే. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే డిజాస్టర్స్.

గత కొన్నేళ్ళుగా అలాంటి మిజరబుల్ డిజాస్టర్స్ ఇస్తూ వస్తున్న పూరీ తన లాస్ట్ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అక్షరాలా 17 కోట్లు. రోగ్ సినిమాతో ప్రొడ్యూసర్స్‌ని, హీరోని, కొన్నవాళ్ళను కూడా పూర్తిగా ముంచిన పూరీ తాను మాత్రం ఏకంగా 17కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాను 35కోట్లలో కంప్లీట్ చేస్తానన్నాడు పూరీ. అందులో బాలయ్య రెమ్యూనరేషన్ పది కోట్లు. ఇక చాలా చాాలా తక్కువ ఖర్చుతో సినిమాను కంప్లీట్ చేయడం, తక్కువ డేస్‌లో సినిమాను కంప్లీట్ చేయడం పూరీ స్పెషాలిటీ కాబట్టి కచ్చితంగా పది నుంచి పదిహేను కోట్ల లోపే షూటింగ్ మాత్రం అవగొట్టేస్తాడనడంలో డౌటే లేదు. అంటే ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా మనవాడికి పది కోట్ల పైనే గిట్టుబాటవుతుందన్నమాట. ఆగడుకు పన్నెండు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రీనువైట్ల వరుసగా మూడు ఫ్లాప్స్ తర్వాత మిస్టర్‌కి తన సొంత డబ్బులు సినిమా కోసం ఖర్చుపెట్టాల్సి వచ్చింది. నిర్మాతలు ఇచ్చింది ఏమీ లేదు. ఇక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా అటూ ఇటూగా పదిహేను కోట్ల దగ్గరే ఉన్నారు. మరి హిట్ ఎప్పుడు ఇచ్చాడో కూడా తానే మర్చిపోయిన పూరీ ఇఫ్పుడు కూడా సినిమాకు పది కోట్లు తీసుకుంటున్నాడంటే మామూలు విషయమే. నిజంగానే దిమ్మతిరిగిపోయే విషయమేగా.

More from my site

Comments

comments