“రాజా ది గ్రేట్” రివ్యూ అండ్ రేటింగ్

చిత్రం :‘రాజా ది గ్రేట్’

నటీనటులు: రవితేజ – మెహ్రీన్ – రాధిక శరత్ కుమార్ – రాజేంద్ర ప్రసాద్ – శ్రీనివాసరెడ్డి – సంపత్ – ప్రకాష్ రాజ్ – సాయికుమార్ – పోసాని కృష్ణమురళి – అన్నపూర్ణ తదితరులు
ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
సంగీతం: సాయికార్తీక్
నిర్మాతలు: దిల్ రాజు – శిరీష్
కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: అనిల్ రావిపూడి

ఏడాదికి రెండు మూడు సినిమాలతో పలకరించే రవితేజ.. ఆశ్చర్యకరంగా రెండేళ్ల పాటు వెండి తెర మీదే కనిపించలేదు. అతడి కెరీర్లో అనుకోని విధంగా గ్యాప్ వచ్చేసింది. ఈ విరామం తర్వాత ఇప్పుడు మాస్ రాజా ‘రాజా ది గ్రేట్’గా వచ్చాడు. పటాస్.. సుప్రీమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విలన్ ఉన్న ఏరియాకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే విలన్‌తో పెట్టుకుంటాడు. ఆ విలన్‌గాడు ఆ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ని చంపేస్తాడు. అదే టైంలో ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు లక్కీ(మెహ్రీన్) ని కూడా చంపేయాలనుకుంటాడు. అయితే లక్కీ ఎస్కేప్ అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని కాపాడడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఈ మొత్తం కథ సినిమా మొదలైన మొదటి ఇరవై నిమిషాల్లోనే అయిపోతుంది. ఆ తర్వాత అంతా పరమ రొటీన్ తెలుగు ట్రేడ్ మార్క్ విలన్-హీరో ఫైట్స్ డ్రామా, కామెడీ ట్రాక్స్, హీరోయిన్‌తో సాంగ్స్…….అలా అలా చివరి వరకూ సాగిపోతుంది. అదీ రాజా ది గ్రేట్ కథ.

 ఈ కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. పరమ రొటీన్ నాసిరకం తెలుగు సినిమా కథ. అది కూడా కొన్ని వందల సార్లు చూసేసిన కథ. అయితే ఈ కథ కంటే కూడా రవితేజ పెర్ఫార్మెన్స్‌లో కనిపించిన మునుపటి స్థాయి ఎనర్జీ…..ఎక్కడా కూడా గ్యాప్ ఇవ్వకుండా….అవకాశం ఉన్న ప్రతిచోటా కూడా కామెడీ సీన్ ఉండేలా….ఆ సీన్ పండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకున్న జాగ్రత్తలు కలిసొచ్చి సినిమా కమర్షియల్‌గా నిలబడే స్థాయిలో తయారైంది. సినిమా ఆసాంతం ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు రవితేజ. సినిమా మొత్తం కూడా అంథుడిగానే కనిపిస్తాడు రవితేజ అందుకే కళ్ళతో ఎక్స్‌ప్రెషన్స్ పలికించే అవకాశం లేకపోవడంతో తన వాయిస్‌లోనే అన్ని భావాలనూ పలికించాడు. డైలాగ్ డెలివరీ విషయంలో రవితేజ తీసుకున్న శ్రద్ధ సినిమాకు ప్లస్ అయింది. ఇక బాడీ లాంగ్వేజ్‌‌లో కూడా మునుపటి జోష్ కనిపించింది. గ్లామర్ విషయంలో ఇంకా డల్‌నెస్ ఉన్నప్పటికీ బ్లైండ్ క్యారెక్టర్ కావడంతో ఆ విషయం పెద్దగా నోటీస్ అవ్వదు. సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్‌తో నిలబెట్టాడు రవితేజ. హీరోయిన్‌గా మెహ్రీన్ ఒకె అనిపిస్తుంది. రాధిక పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. పోసాని, శ్రీనివాసరెడ్డిల కామెడీ క్లిక్ అయింది. ఇక విలన్‌ పాత్రధారితో పాటు అతని తండ్రిగా యాక్ట్ చేసిన తనికెళ్ళ భరణి పండించిన కామెడీ కూడా నవ్వులు పూయించింది. టెక్నికల్‌గా కూడా సినిమా రిచ్‌గా ఉంది. దిల్ రాజు తన బేనర్ స్టాండర్డ్స్ చూపించాడు. మ్యూజిక్ జస్ట్ ఒకే. ఫొటోగ్రఫి బాగుంది. డైలాగుల్లో మాంచి ఫన్ వర్కవుట్ అయింది. సుప్రీమ్ సినిమా స్టైల్‌లోనే ఈ సినిమాను కూడా నడిపించాడు అనిల్ రావిపూడి. తన స్ట్రెంగ్త్ అయిన కామెడీని బాగా పండించాడు. అయితే కథ విషయంలో మాత్రం మరీ వీక్ అయిపోయి యావరేజ్ స్థాయిలోనే ఆగిపోయాడు.

తెలుగు రెగ్యులర్ సినిమాల కోణంలో నుంచి చూస్తే రాజా ది గ్రేట్ గురించి ఇలానే చెప్పుకోవాలి. అయితే రైటింగ్ అండ్ మేకింగ్ స్టాండర్డ్స్ చూసుకుంటే మాత్రం రైటింగ్ విషయంలో ఈ సినిమా కనీస స్థాయిలో కూడా లేదు. కామెడీ డైలాగ్స్ పక్కనపెడితే కథ, కథనాలు ఎక్కడా కూడా ఇంప్రెస్ చేసే స్థాయిలో ఉండవు. అంతా కూడా ఊహకు తగ్గట్టుగానే నడుస్తూ ఉంటుంది. రొటీన్ కథను ఎంచుకున్న డైరెక్టర్ కనీసం కథనంలో అయినా కొత్తగా ట్రై చేయలేకపోయాడు. ఇంకా పరమ రొటీన్ కథనం రాసుకున్నాడు. ఒక రకంగా మంచి సినిమా స్టాండర్డ్స్‌లో చూసుకుంటే ఈ సినిమా కనీస స్థాయిలో కూడా నిలబడదు. కానీ రొటీన్ తెలుగు మాస్ మసాలా ఎంటర్టైనర్ అన్న కోణంలో చూస్తే మాత్రం సినిమా ఆసాంతం నవ్వించడానికి ప్రయత్నించారు…..చాలా సార్లు నవ్వించారు కాబట్టి రొటీన్ మాస్ మసాలా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి పది నిమిషాలకే సినిమా కథ మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత సినిమా అంతా కూడా కామెడీ కోసం, రవితేజ కోసమే చూడాలి. బ్లైండ్‌గా కనిపించడాన్ని మినహాయిస్తే రవితేజ పెర్ఫార్మెన్స్‌లో కనిపించిన వేరేయేషన్ కూడా ఏమీ లేదు. అయితే చాలా కాలం తర్వాత తన ట్రేడ్ మార్క్ ఎనర్జిటిక్ కామెడీ, యాక్షన్ అందించడంలో రవితేజ సక్సెస్ అవ్వడం సినిమాకు కలిసొచ్చింది. మొత్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

రేటింగ్ :- 2.75/5

More from my site

Comments

comments