రాజా వాసిరెడ్డి దెబ్బ……చంద్రబాబు అండ్ కో అబ్బా …

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజా వాసిరెడ్డి వంశీయులు వేద విద్యను అభ్యసించేవారికి చేయూతనందించాలన్న సదుద్దేశంతో సదావర్తి సత్రాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ సదావర్తి సత్రానికి భారీగా భూములు, నగదు విరాళాలు అందించారు. అందులో భాగంగా  ఇప్పటి తమిళనాడులోని మహాబలిపురం రహదారిని ఆనుకుని ఉన్న తాళంబూర్‌లో సదావర్తి సత్రం కోసం 471 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు.

కాల క్రమంలో సత్రం ధర్మకర్తలు 350 ఎకరాల భూమిని వివిధ సందర్భాల్లో విక్రయించారు. మిగిలిన భూమి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఇందులో సుమారుగా 38 ఎకరాలు అధికార పార్టీ నాయకులు, దేవాదాయ శాఖాధికారులు కబ్జాలు చేసి ఆక్రమించుకొన్నారు. ఇకపోతే మిగిలిన 83.11 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఈ భూములపై తెలుగుదేశం పార్టీ నాయకుల కన్ను పడింది. ఇంకేముంది వెంటనే గొప్ప పథకాన్ని అమల్లో పెట్టి ఆ 83.11 ఎకరాల భూమిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా సదావర్తి భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని వాటిని విక్రయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయిస్తూ  కేవలం 22కోట్ల  రూపాయలకే తమ అనుయాయులకు కట్టబెట్టింది.
సదావర్తి భూములపై నిజా నిజాలు బయటకు రావడంతో  రూ.5 కోట్ల రూపాయలు ఎక్కువిస్తే భూములను వారికే ఇచ్ఛేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి  ప్రకటన ఆధారంగా మంగళగిరి వైఎస్‌ఆర్‌ సీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే హైకోర్టులో సదావర్తి భూములపై పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… మరోసారి వేలం నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సదావర్తి భూములను అక్రమ పద్ధతిలో కట్టబెట్టింది 22కోట్ల రూపాయల 30లక్షల రూపాయల చిల్లర మొత్తానికి, అనేక మలుపుల అనంతరం.. అంతిమంగా బహిరంగ వేలంలో సదావర్తి భూములు పలికిన ధర 60కోట్లా 30లక్షల రూపాయలు! అంటే అడ్డదారిలో చంద్రబాబు అండ్ కో దోచేయాలనుకున్న సొమ్ము అక్షరాలా 38కోట్ల రూపాయలు.

ఉదాహరణకు ఆటోలో వెళ్తున్న వ్యక్తి ఆటోలో ఒక లక్ష రూపాయలు మర్చిపోతే, ఆ సొమ్ముని నిజాయతీగా తిరిగి ఇచ్చిన డ్రైవర్ కి పోలీసులు అతిధి మర్యాదలు చేసి రివార్డు క్రింద కొంత మొత్తం ఇచ్చి సత్కరిస్తారు. అంతేనా, అన్ని పత్రికలలో పతాక శీర్షికలతో డ్రైవర్ నిజాయతీని పొగుడుతారు. మరి ఇప్పుడు ప్రజల సొమ్ము 38 కోట్లు కాపాడిన ప్రతిపక్షాన్ని ఏమిచ్చి సత్కరిస్తారో ఆ చంద్రబాబుకే తెలియాలి.

 

More from my site

Comments

comments