లీడర్ సిినిమా స్టైల్‌లో బాహుబలి-2లో కనిపించనున్న జక్కన్న

rajamouli

బాహుబలి-2 సినిమాతో రాజమౌళి చెప్పాల్సిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. బాహుబలి సినిమాలో ఎన్ని ప్రశ్నలకు సమాధాానాలు బేలన్స్ ఉండిపోయాయి అనే విషయాన్ని మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ అద్భుతంగా విశ్లేషించాడని ప్రభాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బాహుబలి సినిమా ఆ స్థాయి కలెక్షన్స్‌ని సాధించడం వినాయక్‌ని షాక్‌కి గురి చేసిందట. ఇక ఇప్పుడు బాహుబలి-2లో మాత్రం అలాంటి ఛాయిస్ రాజమౌళికి ఉండదు. అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాల్సిందే……ఒక్క ప్రశ్న కూడా బేలన్స్ ఉండకూడదు. ఆ ప్రశ్నలన్నింటినీ మీడియా వాళ్ళందరూ కూడా జక్కన్నను ముందుగానే అడిగేస్తున్నారు. ఆ ప్రశ్నలతో పాటు మరో ప్రశ్నను రాజమౌళి ఎదుర్కుంటున్నాడు. అదే బాహుబలి-2 సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ ఉంటుందా అన్న ప్రశ్న.

బాహుబలి సినిమాలో రాజమౌళి ఏ క్యారెక్టర్‌లో కనిపించాడో గుర్తుందా? కోటలో ప్రభాస్‌కి మందు పోసిన మహానుభావుడు రాజమౌళినే. రాజమౌళిని విపరీతంగా అభిమానించే తెలుగు ప్రేక్షకులకు అయితే ఆ క్యారెక్టర్ మాంచి కిక్కించింది. థియేటర్స్‌లో కూడా కేకలు, అరుపులు ఓ స్థాయిలో వినిపించాయి. మరి ఇప్పుడిక బాహుబలి-2 పరిస్థితేంటి? తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకంటే కూడా రాజమౌళి గొప్ప నటుడని హీరో నాని చెప్తూ ఉంటాడు. మరి రాజమౌళిలో ఉన్న ఆ నటుడు బాహుబలి-2లో ఏం చేశాడు. ఇదే ప్రశ్న జక్కన్నను అడిగితే చిన్న స్మైల్ ఇచ్చి ‘పాస్’ అనేశాడు కానీ బాహుబలి యూనిట్ వర్గాలు మాత్రం బాహుబలి-2లో కూడా రాజమౌళి కనిపిస్తాడన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కాకపోతే ఏ సీన్‌లో కనిపిస్తాడు అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల కనిపించిన స్టైల్‌లో ఈ సారి హీరోకి తోడుగా…….మాంచి హీరోయిక్ మూమెంట్‌లో కనిపిస్తాడట రాజమౌళి. మరి బాహుబలి సినిమాని అద్భుతంగా రూపొందించిన జక్కన్న….తన గెస్ట్ రోల్‌ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్ది ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాలా?

Related News

Comments

comments