రాజమౌళి – నానీ వేస్తున్న స్కెచ్ ?

తెలుగు సినిమా దర్శకులలో రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం వుంది. అపజయమెరుగని దర్శకుడిగా ఆయన గురించి అంతా గొప్పగా చెప్పుకుంటూ వుంటారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులు మెచ్చే విధంగా వాటిని తెరపై ఆవిష్కరిస్తూ ఆయన ముందుకెళుతున్నాడు. ఒక సినిమాకి మించి మరో సినిమాను హిట్ చేస్తూ ఔరా! అనిపిస్తున్నాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఇంతవరకూ ఆయనకి మాత్రమే వుండటం విశేషం.

ఇక హీరోలలో నాని ట్రాక్ రికార్డు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి ఇంతవరకూ ఆయనకి అన్నీ విజయాలే. పట్టుమని ఒక హిట్టు కొట్టడమే కష్టంగా వున్న ఈ రోజుల్లో, ఇలా రెండు హ్యాట్రిక్ లు పూర్తి చేసి ..మూడో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం విశేషమేనని చెప్పాలి. ప్రతిభకు .. శ్రమకు .. అదృష్టం కలిసి రావడమంటే ఇదేనేమో.

More from my site

Comments

comments