ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న రాజమౌళి హీరో

అభిమానులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ఫైనల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న‌ ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కాబోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో హీరో త‌ర్వాత మ‌రో కీల‌క పాత్ర ఉంద‌ట‌. ఈ పాత్ర కోసం నారా రోహిత్‌ను తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ తొలుత భావించింద‌ట‌. నారా, నందమూరి క‌ల‌యిక అంటే అంద‌రిలోనూ క్రేజ్ ఉంటుంద‌ని త్రివిక్ర‌మ్ అంచానా వేశార‌ట‌. అయితే తాజాగా నారా రోహిత్ స్థానంలో సునీల్‌ను తీసుకున్నార‌న్న వార్త‌లు బ‌య‌టికొచ్చాయి.
హీరోగా ప‌లు ప్ర‌యత్నాలు చేసిన సునీల్ పెద్ద‌గా విజ‌య‌వంతం కాలేక‌పోయాడు. దీంతో తిరిగి క‌మెడియ‌న్‌గా చేయాల‌నుకుంటున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించాడు. దీంతో త‌న స్నేహితుడికి ఎన్టీయార్ సినిమాలో అవ‌కాశం ఇవ్వాల‌ని త్రివిక్ర‌మ్ భావించాడ‌ట‌. ఎన్టీఆర్ సినిమాతో క‌మెడియ‌న్‌గా సునీల్ రీ-ఎంట్రీ చేస్తున్నాడనే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కి సునీల్ ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సునీల్ – త్రివిక్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. వీరి కలయికలో సినిమా ఉంటుందని టాలీవుడ్ లో చాలాసార్లు వార్తలు వచ్చాయి కూడా. సునీల్ – పవన్ 25వ చిత్రంలో కనిపిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అది నిజం కాదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో తప్పకుండా ఉంటాడని చెబుతున్నారు.

More from my site

Comments

comments