మెగా మల్టీస్టారర్ గా రాజమౌళి సినిమా..!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి పార్ట్-2 సక్సెస్ తో కొద్ది పాటి గ్యాప్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతుంటే ఎలాంటి కాంబినేషన్ అయినా సరే సెట్ చేసి బాహుబలి కంటే పెద్ద సినిమా తీయాలని వారు ఉత్సాహపడుతున్నారు. బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ ను శాసించిన రాజమౌళి తన తర్వాత సినిమా కూడా అదే రేంజ్ లో తీయాలనే ఆలోచనలో ఉన్నారట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుగు, తమిళ, హింది ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోని సెలెక్ట్ చేసి ముగ్గురితో ఒకే సినిమా చేస్తున్నాడట. ఇది కనుక జరిగితే ఇదో మెగా మల్టీస్టారర్ మూవీ అయ్యే అవకాశం ఉంది. బాహుబలి తర్వాత చిన్న సినిమా తీస్తాడేమో అనుకున్న ప్రేక్షకులకు షాక్ ఇస్తూ ఈసారి మరో పెద్ద ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నాడట జక్కన్న.

ఇప్పటికే మూడు భాషల్లోని స్టార్ హీరోలతో ఈ సినిమా గురించి చర్చలు జరిపారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారట. మరి ఒకవేళ ఇదే నిజం అయితే కచ్చితంగా ఈ సినిమా కూడా మరో బాహుబలి అవుతుందని చెప్పొచ్చు. సాధారణంగా ఓ పెద్ద సినిమా తీశాక అంచనాలేమి లేకుండా వెంటనే ఓ చిన్న బడ్జెట్ సినిమా తీసే రాజమౌళి మొదటిసారి డేర్ స్టెప్ వేస్తున్నాడు. మరి దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

More from my site

Comments

comments