బాహుబలి డైరక్టర్ ను మరోసారి పడేసిన నాని.. మాములోడు కాదండోయ్..!

నాచురల్ స్టార్ నాని మాములోడు కాదు.. అష్టా చమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని మొన్నామధ్య కెరియర్ సంక్షోభంలో పడినట్టు కనిపించినా ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. భలే భలే మగాడివోయ్ నుండి రీసెంట్ గా వచ్చిన నేను లోకల్ సినిమా దాకా నాని గ్రాఫ్ అలా పెరుగుతూ పోతుంది. నాని సినిమా అంటే హిట్ గ్యారెంటీ అని ఆడియెన్ ఫిక్స్ అయ్యేలా సినిమాలు చేస్తున్నాడు నాని.

కథల విషయంలో అతను తీసుకుంటున్న జాగ్రత్తలే తన హిట్ కు కారణమని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో చేస్తున్న సినిమా నిన్ను కోరి. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవగా ఈ ట్రైలర్ చూసి బాహుబలి దర్శకుడు రాజమౌళి స్పందించాడు. ఈ సినిమాను తప్పకుండా మొదటి ఆట చూడాలనుకుంటున్నా అని ట్వీట్ చేశాడు. తానో పెద్ద డైరక్టర్ అయినా చిన్న సినిమాను ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు రాజమౌళి.

అంతేకాదు తను డైరెక్ట్ చేసిన ఈగ సినిమాలో నానినే హీరో. సో అలా తన హీరో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి నిన్ను కోరి గురించి సర్ ప్రైసింగ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తో సగం సినిమా హిట్ అయ్యినట్టే అని నాని స్పందించాడు. మరి జక్కన్న సినిమా చూస్తున్నాడు అంటే జూలై 7న రిలీజ్ అవుతున్న నాని నిన్ను కోరికి ప్రమోషన్ దిగులు అవసరం లేనట్టే.

More from my site

Comments

comments