‘రాజు గారి గది 2’ ట్వీట్ రివ్యూ

5:41 AM : చిత్రం పూర్తయింది.

5:37 AM : సమంత మనసు మార్చుకుని ఈ ప్రపంచాన్ని వదలి వెళ్లిపోయింది.

5:36 AM : చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. సమంత, నాగార్జున మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

5:329 AM : చిత్రం పూర్తిగా రివేంజ్ డ్రామాగా మారిపోయింది. తన శత్రువుల కోసం సమంత వేట మొదలైంది.

5:12 AM : ఆ సంఘటనలపై సస్పెన్స్ కొనసాగుతోంది.

5:11 AM : కొన్ని ఊహించని పరిణామాల వల్ల సమంత మరియు ఆమె తండ్రి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని నాగ్ గ్రహించాడు.

5:03 AM : సమంత తండ్రిగా రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు.

4:47 AM : సమంత ఉందనే విషయాన్ని నాగ్ గ్రహించాడు. ప్రస్తుతం హర్రర్ సన్నివేశాలు వస్తున్నాయి.

4:46 AM : ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.

4:40 AM : దెయ్యం గురించి నాగ్ సమగ్రమైన విచారణ జరిపాడు. ఆసక్తికరమైన సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.

4:32 AM : నాగ్ క్యారెక్టర్ ని తెలియపరిచే సన్నివేశాలు వస్తున్నాయి. మెంటలిజం అనే కాన్సెప్ట్ ని ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ అయ్యేలా దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు.

4:22 AM : కింగ్ నాగార్జున ‘రుద్ర’ గా సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. మనిషిని చూసి లోపల ఏమనుకుంటున్నాడో చెప్పగలిగే మెంటలిస్ట్ పాత్రలో నాగ్ కనిపిస్తున్నాడు.

4:15 AM : రిసార్ట్ లో అద్భుతమైన హర్రర్ కామెడీ సీన్స్ కొనసాగుతున్నాయి.

4:10 AM : రిసార్ట్ లో మిగిలిన వారికి కూడా దెయ్యం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. తేజస్వి మదివాడ కూడా సీన్ లోకి ఎంటర్ అయింది.

4:00 AM : రిసార్ట్ లో దెయ్యం ఉందనే విషయం వెన్నెల కిషోర్ కి అర్థం అవుతోంది. ప్రస్తుతం హర్రర్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

3:54 AM : హీరోయిన్ సీరత్ కపూర్ మరియు విద్యుల్లేఖ కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం బీచ్ రిసార్ట్ లో ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

3:50 AM : షకలక శంకర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ నటుడు నరేష్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు.

3:45 AM : టైటిల్స్ మొదలయ్యాయి.. ప్రవీణ్, వెన్నెల కిషోర్ మరియు అశ్విన్ లు స్నేహితులుగా ఎంట్రీ ఇచ్చారు.

3:40 AM : చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

Comments

comments