చరణ్ తోనే ‘చోటామేస్త్రి’.. సంపత్ నంది ఫిక్స్..!

ఏమైంది ఈవేళ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రచ్చ సినిమా తీసి మాస్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ సంపత్ నంది. ఏడాడిన్నర క్రితం బెంగాల్ టైగర్ తో వచ్చిన సంపత్ ప్రస్తుతం గోపిచంద్ హీరోగ గౌతం నంద సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విషయాలతో పాటుగా చరణ్ తో చోటా మేస్త్రి విషయాలను బయటపెట్టాడు సంపత్ నంది.

మెగాస్టార్ ముఠామేస్త్రిలా మెగా వారసుడు రాం చరణ్ తో చోటా మేస్త్రి సినిమా తీయాలని సంపత్ నంది తెగ ప్రయత్నాలు చేశాడు. రచ్చ హిట్ తర్వాత చరణ్ ఇంట్రెస్ట్ చూపించినా చిరు ఎందుకో ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే ఆ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిందట. చరణ్ కు బాగా నచ్చినా మెగా ఆమోదం లభించలేదు కాబట్టి సైలెంట్ అయ్యాడట.

ఇక ఎన్నాళ్లకైనా రాం చరణ్ తో చోటా మేస్త్రి తీస్తానని అంటున్నాడు డైరక్టర్ సంపత్ నంది. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఒప్పించేలా కథ సిద్ధం చేస్తానని అంటున్నాడట. స్టార్ హీరోకి పక్కా మాస్ సినిమా కావాలంటే కచ్చితంగా సంపత్ నంది దగ్గరకు రావొచ్చు. సినిమాలో హీరో ఇమేజ్ తో పాటుగా పక్కా మాస్ క్రేజ్ తెచ్చేలా సంపత్ సినిమాలు బి, సి సెంటర్ల ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు.

More from my site

Comments

comments