బాలకృష్ణ అండతో ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి ముందుకు సాగుతున్న రానా

టాలీవుడ్ స్టార్ హీరోలు బుల్లి తెరపై యాంకరింగ్ చేసే సంప్రదాయాన్ని కింగ్ నాగార్జున ప్రారంభించారు.మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ షో సూపర్ సక్సెస్ అయింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అదే షో కి హోస్ట్ గా వ్యవహరించారు. ఇద్దరు సీనియర్ హీరోలు బుల్లి తెరపై సక్సెస్ కావడంతో ఈ జనరేషన్ హీరోలు కూడా అలాంటి షోలపై కన్నేశారు. అన్ని భాషల్లో విజయవంతం అయిన బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ అనగానే భారీ హైప్ క్రియేట్ అయింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూశాడు. మరో వైపు బాహుబలి చిత్రం ద్వారా జాతీయ గుర్తింపు పొందిన ఆరడుగుల ఆజాను బాహుడు రానా నెం 1 యారి షోకి హోస్ట్ గా మారాడు.

మొదట్లో బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ ఫ్యాక్టర్ తోపాటు, భారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు కలసి వచ్చాయి. రానా నెం 1 యారి షోమాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభమైంది. అంతా ఊహించిన విధంగానే మొదట్లో బిగ్ బాస్ షో మంచి టీఆర్పీ రేటింగులతో సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ టీఆర్పీ రేటింగులు తగ్గు ముఖం పట్టాయి. అనూహ్యంగా నెం 1 యారి షో కి మంచి టీఆర్పీ రేటింగులు దక్కుతుండడం విశేషం. గత వారం బిగ్ బాస్ షో కి వచ్చిన టీఆర్పీ రేటింగులని పరిశీలిస్తే..ఎన్టీఆర్ అప్పియరెన్స్ ఉన్నరోజు మాత్రం 7 దాటుతోంది. మిగిలిన రోజుల్లో 6 లోనే ఆగిపోతోంది. బిగ్ బాస్ షో కి సగటున ప్రస్తుతం వస్తున్న రేటింగ్ 6.4 మాత్రమే. ఇక రానా నెం 1 యారి షో 10 కి పైగా టీఆర్పీరేటింగులతో దూసుకుని పోతోంది. నెం 1 యారి కి సగటున వస్తున్న రేటింగ్ 10.6 కావడం విశేషం.

ముఖ్యమైన విషయమేమిటంటే బిగ్ బాస్ షో లోకి బాలకృష్ణ వచ్చి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక బాలకృష్ణ ఇప్పుడు రానా నెం 1 యారి షోకి పైసా వసూల్ ప్రమోషన్ కి వెళుతున్నాడు. దీనికి పోటీగా ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ షోలోకి జై లవకుశ టీమ్ ని రంగంలోకి దించి ఎన్టీఆర్ సూపర్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టి టీఆర్పీ రేటింగ్ లో మళ్ళీ మొదటి స్థానానికి బిగ్ బాస్ షోని తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కనుక మనవంతు సహకారం మనమూ అందిద్దాం.

More from my site

Comments

comments