బాక్సాఫీస్ ని భస్మం చేసిన రావణ- కొత్త రికార్డు లిఖించిన కలియుగ లవకుశులు

కేవలం నాలుగు రోజుల్లోనే వందకోట్ల రూపాయల మార్కుకు చేరుకుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా.. వీకెండ్‌లో కలెక్షన్లను భారీగానే కొల్లగొట్టింది. అమెరికాలో యూఎస్ తెలుగు మూవీ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఓవర్సీస్‌లో దాదాపు 185 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా శుక్రవారం నాటికే ఒక మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. ఆదివారం ఈ సినిమా 1 లక్ష 64 వేల 608 డాలర్లను కొల్లగొట్టి.. ఓవరాల్‌గా 14 లక్షల 46 వేల 691 డాలర్లను (9.51 కోట్ల రూపాయలను) కలెక్ట్ చేసింది.  కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఆదివారం నాటికి మొత్తం నాలుగు రోజుల్లో 94 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో వందకోట్ల రూపాయల మార్కుకు చేరుకున్న ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ తన పేరు మీద లిఖించుకొంది. అన్ని సెంటర్స్ లో కలిపి సోమవారం 8 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. వివరాలు తెలియాల్సి ఉంది.

నిన్న లవకుశ విజయోత్సవ సభలో ఎన్టీఆర్ రివ్యూలపై ఉద్వేగభరిత ప్రసంగం…… ‘ఎమెర్జెన్సీ లో ఉన్న పేషెంట్ – డాక్టర్ – దారిన పోయే దానయ్య’ అంటూ సుదీర్ఘంగా ఉదహరించిన జూనియర్ ఎన్టీఆర్,  సినిమా అనేది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ లాంటిదని, డాక్టర్లుగా భావించే ప్రేక్షకులు చెప్పే ముందు, ఎవరో దారిన పోయే దానయ్య మాదిరి కొంతమంది సినీ విశ్లేషకులు సినిమాలను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇది మా ఒక్క సినిమాకు మాత్రమే జరగలేదని, అన్ని సినిమాలకు జరుగుతోందని, డాక్టర్లుగా భావించే తమ ప్రేక్షకులు చెప్పే వరకు ఆగండి… అంటూ సునిశితంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ డాక్టర్లు ‘వీడు బతకడు, చచ్చిపోతాడు’ అంటే దానిని అంగీకరించడానికి మేం సిద్ధం, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా తీస్తాం, అభిమానులకి నచ్చే విధంగా తీస్తాను. అంతేగానీ ‘ఇక అయిపొయింది, పోయాడు, చచ్చిపోయింది’ అంటూ మీరు డిక్లేర్ చేయవద్దని తారక్ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించాడు. మన ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికి చెప్పడానికి హక్కుంది, దానిని కాదనను అంటూ… నా ఆవేదన చెప్పడానికి ప్రయత్నించానే తప్ప, ఎవరిని హర్ట్ చేయాలని కాదంటూ… మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
జై లవకుశ 1st wknd WW BO Gross: AP/TS – ₹ 64 Cr KA -₹ 11.25 Cr TN – ₹ 2.25 Cr ROI – ₹ 2.5 Cr USA – ₹ 9.25 C ROW – ₹ 5.25 C Tot – ₹ 94.5 Cr

సోమవారంతో 100 కోట్ల కలెక్షన్లు సాధించి నాన్ బాహుబలి రికార్డు తమ పేరున లిఖించుకొన్నారీ అభినవ లవకుశులు.

More from my site

Comments

comments