చరణ్ సినిమా షూటింగ్‌కి బ్రేక్…కారణం ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

charan

రామ్ చరణ్ తేజ్-సుకుమార్‌ల సినిమా షూటింగ్ గోదావరి పల్లెల్లో జరుగుతోంది. మామూలుగా అయితే, మన హీరోల వ్యవహార శైలి ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద సాహసోపేత నిర్ణయమే. కానీ సుకుమార్‌కి సహజత్వం అంటే చాలా ఇష్టం. స్క్రీన్ పైన కనిపించే ప్రతిదీ కూడా సహజంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అని తపిస్తాడు. అన్నింటికీ మించి తాను పుట్టి పెరిగిన, తన జీవితంలో చాలా కీలక పాత్ర పోషించిన గోదావరి ప్రజల జీవితాన్ని తెరపైన ఆవిష్కరించాలన్న తాపత్రయం కూడా సుకుమార్‌కి ఎక్కువే. ఇక మొగల్తూరు మొనగాళ్ళయిన చిరు కుటుంబ సభ్యుల గురించి చెప్పేదేముంది? గోదావరి అంటే సై అనేస్తారు. అందుకే చరణ్-సుక్కు సినిమా యూనిట్ గోదావరి పల్లెల్లో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్ళింది.

అయితే అక్కడే చరణ్-సుకుమార్‌లు ఊహించని విధంగా షూటింగ్‌కి అంతరాయం కలుగుతోంది. రెగ్యులర్ బ్రేక్స్ పడుతున్నాయి. అందుకు కారణం మెగా ఫ్యాన్స్ కావడం గమనార్హం. రామ్ చరణ్‌లాంటి సూపర్ ఫాలోయింగ్ స్టార్ హీరోతో తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం అంటే మాటలా? ఫ్యాన్స్ అభిమానాన్ని తట్టుకుని మరీ, ఫ్యాన్స్‌కి నచ్చచెప్పి బ్రేక్స్ లేకుండా షూటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే. మొదటి రోజుల్లో చాలా తక్కువ మంది బౌన్సర్స్‌తోనే షూటింగ్ కానిచ్చిన సుకుమార్ ఆ తర్వాత మాత్రం సెక్యూరిటీ కోసం హైదరాబాద్ నుంచి చాలా మందిని రప్పించారు. అలాగే తన సినిమాలకు సంబంధించిన చిన్న ఫోటో కూడా బయటకు రావడం సుకుమార్‌కి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్న నేపథ్యంలో….రామ్ చరణ్‌ని చూసిన ఆనందంలో వాళ్ళందరూ కూడా రామ్ చరణ్‌ని కెమేరాలో బంధిస్తున్నారు. ఆ వెంటనే వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో షేర్ చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ చాలానే బయటకు వచ్చాయి. సుకుమార్‌కి అదో అదనపు టెన్షన్ పట్టుకుంది. అందుకే గత రెండు రోజులుగా ఫ్యాన్స్ అందరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడట సుకుమార్. దూరం నుంచి చూడడం వరకూ ఒకె కానీ షూటింగ్‌కి అంతరాయం కలిగేలా చెయ్యొద్దని, అలాగే సెల్ కెమేరాలతో ఫొటోలు, వీడియోలు తియ్యుద్దని చెప్తున్నాడట. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న మెగా పవర్ స్టార్ సినిమా ఓ రేంజ్‌లో ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సుకుమార్ ఇబ్బందులను అర్థం చేసుకుని షూటింగ్‌కి సహకరిస్తే బాగుంటుంది కదా. సినిమా యూనిట్ మెంబర్స్‌కి లోకల్ తినుబండారాలు ఇచ్చి ఇంకా ప్రోత్సహిస్తున్న ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారండోయ్.

Comments

comments