బద్రి సినిమా షూటింగ్ టైంలో కళ్ళు ఎర్రబడేలా ఏడ్చానంటున్న రేణు

pawan-renu

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా బద్రి సినిమాను ఎప్పటికీ మరిచిపోరు. పవన్‌లో ఉన్న ఒక స్టైలిష్…సూపర్ హీరోయిజాన్ని బయట పెట్టిన సినిమా అది. అంత వరకూ స్టూడెంట్ క్యారెక్టర్స్‌తోనూ, లవర్ బాయ్ క్యారెక్టర్స్‌తోనూ ఎక్కువగా అలరించిన పవన్…బద్రి సినిమాతో తనలో ఉన్న యాక్షన్ హీరోను కూడా ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి చూపించాడు. అలాగే ఆ సినిమాతోనే డైరెక్టర్‌గా లైఫ్ తెచ్చుకున్న పూరీ కూడా బద్రి సినిమాను ఎప్పటికీ మర్చిపోడు. ఇక బద్రి సినిమాను జీవితాంతం గుర్తు పెట్టకుని ఉండే మరో వ్యక్తి హీరోయిన్ రేణూదేశాయ్. బద్రి సినిమా రేణూ దేశాయ్ జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడో మరఠా నుంచి వచ్చిన రేణూ జీవితంలో బద్రి సినిమాతోనే తెలుగు హీరోయిన్‌, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భార్య, అలాగే తెలుగుంటి కోడలు…ఇలా ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ఇక బద్రి సినిమా టైంలోనే కళ్ళు ఎర్రబడే స్థాయిలో ఏడ్చానని తాజాగా చె్ప్పుకొచ్చింది రేణూదేశాయ్.

బద్రి సినిమాలో రేణూ దేశాయ్ సాంప్రదాయ నృత్యం చేస్తూ ఉండే పాట ఒకటుంది ఐడియా ఉందా. ఆ పాటలో రేణూదేశాయ్ ఓ గురువు దగ్గర సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటూ స్టైలిష్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్…ఆ డ్యాన్స్‌ని కలగాపులగం చేసేస్తాడు. ఆ తర్వాత ఆ గురువు ఇద్దరినీ అక్కడ నుంచి పంపించి వేస్తాడు. ఆ షూటింగ్ టైంలోనే కళ్ళు ఎర్రబడే స్థాయిలో ఏడ్చేసిందట రేణు. ఏడుస్తూనే ఆ డ్యాన్స్ చేసిందట. ఇప్పుడు బద్రి సినిమాలో వచ్చే పాటను…జాగ్రత్తగా చూస్తే ఆ విషయం తెలిసిపోతుందని చెప్పుకొచ్చింది రేణు. ఆ పాటకు సంబంధించిన ఒక ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కరెక్ట్‌గా ఆ సాంగ్ షూటింగ్ టైంలోనే ఓ బైక్ యాక్సిడెంట్‌లో రేణూ దేశాయ్ ఫ్రెండ్ చనిపోయిందన్న విషయం రేణూకి తెలిసిందట. ఆ చనిపోయిన అమ్మాయి రేణూకి బెస్ట్ ఫ్రెండ్ అట. అందుకే ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఏడుపు ఆగలేదని చెప్పుకొచ్చింది రేణూ. అయినప్పటికీ షూటింగ్‌కి అంతరాయం కలగకుండా యాక్ట్ చేసింది రేణూ దేశాయ్. ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నింటినీ డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణే అన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ని కూడా పవనే షూట్ చేశాడు. రేణూదేశాయ్‌కి ఆ ధైర్యాన్ని పవనే ఇచ్చి ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పాలా?

Related News

Comments

comments