శంకర్ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు .. రోబో సినిమా అప్పుడే …

శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ 2.0’ .. షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషల్లో ఒకేసారి డబ్బింగ్ పనులు జరుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

లైకా ప్రొడక్షన్స్ వారు దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. రజనీ .. అక్షయ్ కుమార్ .. అమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ‘బాహుబలి 2’ తరువాత అంతకన్నా ఎక్కువ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘బాహుబలి 2’ సాధించిన రికార్డులను ఈ సినిమా అధిగమించగలుగుతుందా? .. లేదా? అనేది ఆత్రుతను పెంచుతోంది.

More from my site

Comments

comments