‘సై’ రా ….. నరసింహారెడ్డి డైలాగ్ లీక్ అయ్యింది. డైలాగ్ వింటే ఒళ్ళు జలదరిస్తుంది.

సినిమా రంగానికి లీకుల బెడద ఎక్కువయ్యింది , కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగానే లీకులు వస్తుంటాయి అలాగే రిలీజ్ కి ముందు సినిమా కానీ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కానీ లీక్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం . తాజాగా సెట్స్ మీదకు కూడా వెళ్లని ” సైరా …… నరసింహారెడ్డి ” సినిమాలోని డైలాగ్ ఇదే అంటూ తెగ ప్రచారం సాగుతోంది . ఈ డైలాగ్ అసలు సైరా ….. నరసింహారెడ్డి సినిమాలోనిదేనా ? కదా ? అనేది పక్కన పెడితే డైలాగ్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంది.

” ఒరేయ్ ….. నేను ఒట్టి చేతులతో వచ్చా …… నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్ ! అయినా నా చెయ్యి మీసం మీదకి పోయేసరికి నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా ….. ” అనే పవర్ ఫుల్  డైలాగ్ ఫిలిం నగర్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది . ఇది సైరా సినిమాలో నిదేనా అన్న విషయం ఇంకా తెలియలేదు . ఈ లీకుల విషయాన్నీ పక్కన పెడితే ఇటీవలే రిలీజ్ అయినమోషన్ పోస్టర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.

Comments

comments