నీకో నమస్కారం నీ —–కో నమస్కారం రా బాబూ !

ద్విచక్రవాహనంపై ఒకసారి ఎంతమంది ప్రయాణించగలరు. ఇద్దరు ఏదైనా అర్జెంటు అయితే ముగ్గురు. కానీ, మనకి కన్పిస్తున్న ఫొటోలో ఏకంగా అయిదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా. ఇది చుసిన సర్కిల్ కి దిమ్మ తిరిగింది. ఏం చేయాలో అర్థం కాక చేతులెత్తి దణ్ణం పెట్టి ఇది తప్పురా బాబూ అని చెప్పి భద్రత గురించి వివరించాడు.

అనంతపురం జిల్లాలో రహదారి భద్రతపై పోలీసులు ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టరు శుభకుమార్ కి వింత అనుభవం ఎదురైంది. హనుమంతుడు అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తన ఇద్దరు పిల్లలు, భార్య, మరదలితో కలిసి ప్రయాణిస్తూ కనిపించాడు. ద్విచక్రవాహనంపై ఒకేసారి అయిదుగురిని చూసిన సీఐ కి ఏమి చేయాలో అర్థం కాక తన రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ఇలా ప్రయాణించడం తప్పు అని పంపించేశాడు. సీఐ వాహనచోదకుడికి నమస్కారం పెట్టే సమయంలో ఎవరో ఫోటో తీసి ట్విట్టర్ లో పెట్టారు అది కాస్తా వైరల్ అయింది.

 

 

More from my site

Comments

comments