అక్కినేని ఫ్యామిలీని ఇరకాటంలో పడేస్తున్న సమంత..!

ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా హీరో అక్కినేని హీరో నాగ చైతన్యతో అప్పటి నుండి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అభిరుచులు కలవడంతో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఇయర్ మొదట్లోనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న చైతు, సమంతలు అక్టోబర్ 6న పెళ్లి చేసుకోబోతున్నారు. కష్టపడి హీరోయిన్ గా పైకొచ్చిన సమంత మ్యారేజ్ తర్వాత కూడా తన లైఫ్ తను ఇష్టానుసారంగానే నడవాలని భావిస్తుంది.

దానికి చైతు ఒప్పుకున్నాడు కాబట్టే అతనితో పెళ్లికి సిద్ధమయ్యింది. తనకు ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాలను మాత్రం అసలు వదిలే ఛాన్స్ లేదని సమంత ఖరాకండిగా చెప్పేసింది. అయితే సినిమాల వరకు బాగానే ఉన్నా పెళ్లి దగ్గర పడుతున్నా సమంత చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ అభ్యంతరకరంగా మారాయి వీటి వల్ల అక్కినేని ఫ్యామిలీని ఇరకాటంలో పడేస్తుంది.

రీసెంట్ గా జె.ఎఫ్.డబల్యుకి మేగజైన్ కోసం సమంత ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలిసిందే. సమంత జోరు చూస్తుంటే పెళ్లి తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తుందని అనిపిస్తుంది. ఏయన్నార్, నాగార్జున ఫ్యామిలీలో ఒకటిగా కాబోతున్న సమంత ఇలా స్కిన్ షోతో వారిని ఇబ్బందుల్లో పడేస్తుందని చెప్పొచ్చు. ఎంత సినిమాలు చేయమన్నా సరే ఇలా హాట్ షో చేస్తే ఎలా అని అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతున్నారు. సమంత చేసే ప్రతి పని చైతు సమ్మతంతోనే అని అంటున్నారు. మరి మునుముందు సమంత తన ఆలోచనల్లో మార్పు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

More from my site

Comments

comments