కుర్రాళ్లతో పాటు రాజేంద్రుడు కూడా ఇరగదీశాడు.. శమంతకమణి థియేట్రికల్ ట్రైలర్ (వీడియో)

టాలీవుడ్ కి మంచిరోజులు వచ్చాయి యంగ్ హీరోలు ఒకళ్ళ సినిమా ఫంక్షన్లకి మరొకళ్ళు వెళ్తూ మంచి సంప్రదాయానికి కొన్నేళ్ల క్రితం తెరతీశారు. అయితే గత సంవత్సరం నుండి మాత్రం ఒకళ్ళ సినిమాలో మరొకళ్ళు గెస్ట్ పాత్రల్లోనో లేక సెకండ్ హీరోగానో నటిస్తున్నారు. మజ్ను సినిమాలో రాజ్ తరుణ్, జ్యో అచ్యుతానంద సినిమా, నేను లోకల్ సినిమాలో నాని నవీన్ చంద్ర ఇలా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పుడు భలే మంచి రోజు తో డిఫరెంట్ హిట్టు కొట్టిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు కుర్ర హీరోలు కలిసి నటిస్తున్నారు.. అంతే కాక వీరితో పాటు నవ్వుల రాజేంద్రుడు కూడా పాత్ర కలిపాడు. ఈరోజు విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ లో ఇక చూడండి వీరి అల్లరి.. రిపీటెడ్ గా అలా చూస్తూనే ఉంటారు..

Comments

comments