షాకింగ్ బ్రేకింగ్……బాహుబలి2 సినిమా లీక్డ్

స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని సినిమాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం మాట ఎలా ఉన్నా ఈ స్మార్ట్ టెక్నాలజీ పుణ్యమాని సినిమా వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. అంతకుముందు కూడా ఈ పైరసీ గొడవలు ఉన్నప్పటికీ అత్తారింటికి దారేది సినిమాతో మొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్ తినింది. రిలీజ్ బిఫోరే పవన్ కళ్యాణ్ లాంటి టాప్ రేంజ్ హీరో నటించిన సినిమాలో చాలా ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లో కనిపించడంతో ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు బాహుబలి-2 సినిమా విషయంలో కూడా లీకేజీ వ్యవహారం గుప్పుమంటోంది.

బాహుబలి సినిమాకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. అప్పుడు రాజమౌళి ‘ఇంటి దొంగలే దొంగతనం చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు’ అని నిరాశగా మాట్లాడారు. ఇప్పుడు బాహుబలి-2 సినిమా మొత్తం ఆన్లైన్‌లో లీకైందేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రెండు రోజులుగా బాహుబలి సినిమాతో పాటు బాహుబలి-2 ట్రైలర్….అలాగే ఇప్పటి వరకూ అఫిషియల్‌గా రిలీజ్ అవని కంటెంట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాల వివిధ సన్నివేశాల్లో వచ్చే విజువల్స్‌ని స్క్రీన్ షాట్స్‌గా తీసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. బాహుబలి-2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే చాలా దేశాలకు హార్డ్ డిస్క్‌లు వెళ్ళిపోయాయి. కరెక్ట్ రిలీజ్‌కి రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో  సినిమా లీకేజ్ వ్యవహారం బాహుబలి-2 టీంకి తలనొప్పిగా మారింది. లీక్ అయిన సినిమా చాప కిందనీరులా అందరికీ రీచ్ అవుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఎంత సినిమా లీక్ అయింది? ఎవరు లీక్ చేశారు అనే విషయాలపై అంతర్గతంగా ఎంక్వైరీ జరుపుతున్నారు. అలాగే ఆన్‌లైన్ సైట్స్‌లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. మరి బాహుబలి-2 సినిమా రిలీజ్ అయిన రెండు వారాల వరకూ కూడా ఈ పైరసీ దాడిని రాజమౌళి ఎంత సమర్థవంతంగా ఎదుర్కుంటాడో చూడాలి. ఎంతో కష్టపడి జక్కన్న చెక్కిన ఈ శిల్పానికి చెద పట్టకూడదని….ప్రేక్షకులందరూ కూడా తెరపైనే చూసి ఆనందించాలని మనమూ కోరుకుందాం.

More from my site

Comments

comments