షాకింగ్ ఫేట్..తెర వెనుక కూడా బాహుబలిని చంపేస్తున్న కట్టప్ప

bahubali-kattappa

తెరపైన బాహుబలిని చంపింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం బాహుబలి సినిమా గురించి తెలిసిన అందరికీ తెలుసు. ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు మాత్రం బాహుబలి సినిమా యూనిట్‌కి మాత్రమే తెలుసు. ఇదంతా కూడా తెరపైన వ్యవహారం. అయితే తెరవెనుక కూడా బాహుబలిని చంపేస్తున్నాడు కట్టప్ప.

బాహుబలి సినిమాతో కనీవినీ ఎరుగని కలెక్షన్స్ సాధించిన రాజమౌళికి బాహుబలి-2 రిలీజ్‌తో మాత్రం చాలా సమస్యలే వచ్చిపడుతున్నాయి. తమిళనాడులో కూడా ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలన్న ప్రయత్నాలు జరిగాయి కానీ కోర్ట్ తీర్పు పుణ్యమాని అక్కడ లైన్ క్లియర్ అయింది. ఇప్పుడిక కర్ణాటకలో మాత్రం బాహుబలి-2 సినిమా కచ్చితంగా చచ్చిపోయేలానే కనిపిస్తోంది. సినిమాలో బాహుబలిని చంపిన కట్టప్పనే……ఇప్పుడు తెరవెనుక కూడా బాహుబలి-2ని చంపేయబోతున్నాడు. ఎప్పుడో పదేళ్ళ క్రితం కన్నడిగులకు వ్యతిరేకంగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ మాట్లాడిన మాటల పుణ్యామాని ఇప్పుడు అక్కడ నిప్పు రాజుకుంది. రాజమౌళి ఆల్రెడీ కన్నడ భాషలో కూడా కన్నడ ప్రేక్షకులకు విజ్ఙప్తి చేశాడు. రాజమౌళికి కర్ణాటకతో ఉన్న అనుబంధం తెలిసిందే. ఒక రకంగా మన జక్కన కన్నడ పౌరుడు కూడా. ఇక ఈ రోజు కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణ చెప్పాడు. అయితే క్షమాపణ చెప్పడంతో ఊరుకోకుండా…..తన సొంత భాష ప్రేక్షకులయిన తమిళులను మెప్పించేలా తమిళనాడు సమస్యలపైన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటానని….పాత్రలు రాకపోయినా ఫర్వాలేదని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సత్యరాజ్ వ్యవహార శైలి చూస్తుంటే కట్టప్ప పాత్రలో తెరపైన బాహుబలిని చంపడంతో పాటు తెరవెనక కూడా బాహుబలి-2 సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర చంపేసేలా ఉన్నాడు. బాహుబలి-2 సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అన్ని భాషల్లోనూ విడుదలవ్వాల్సిందే….అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాల్సిందే. కట్టప్పతో వచ్చిన ఈ సంకటాన్ని మన జక్కన్న ఎలా పరిఫ్కరించుకుంటాడో చూడాలి మరి.

Related News

Comments

comments