షాకింగ్….జైలవకుశలో ఆ యంగ్ బబ్లీ హీరోయిన్ కూడా

jai-lavakusa

జైలవకుశ క్రేజ్ మామూలుగా లేదు. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ బాబీతో ఎన్టీఆర్ సినిమా అన్న వెంటనే అనుమానంగా చూసినవాళ్ళే ఎక్కువ మంది. అయితే టెంపర్ సినిమా నుంచీ కూడా తన జడ్జ్‌మెంట్ విషయంలో వంద శాతం పక్కాగా ఉన్న ఎన్టీఆర్ పైన మాత్రం కొంతమంది నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచీ మాత్రం డైరెక్టర్ బాబీ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ప్రాజెక్ట్ క్రేజ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌కి వంద కోట్ల సినిమా ఇవ్వాలన్న నందమూరి లవకుశుల కలను నిజం చేసేలానే కనిపిస్తున్నాడు. జైలవకుశ అనే టైటిల్…ముగ్గురు ఎన్టీఆర్‌లు….మూడు క్యారెక్టర్స్ కూడా హై ఎనర్జిటిక్, పవర్ఫుల్ క్యారెక్టర్సే. తెరవెనుక దేవిశ్రీ ప్రసాద్‌లాంటి టాప్ రేంజ్ టెక్నీషియన్స్. ఒక సినిమాకు క్రేజ్ రావడానికి ఇంతకంటే ఏం కావాలి?

పైన స్సెషాలిటీస్ అన్నింటితో పాటు హీరోయిన్స్ ఎంపిక విషయం జైలవకుశ పైన ఆసక్తి క్రియేట్ అయ్యేలా చేస్తోంది. రాశిఖన్నా లాంటి గ్లామరస్, హాట్ హీరోయిన్, అలాగే టాలెంటెడ్, క్యూట్ యాక్ట్రెస్ నివేదా థామస్‌లను తీసుకునే షాక్ ఇచ్చిన బాబీ…ఆ తర్వాత హాట్ ఐటెం బాంబ్ హంసా నందినిని సీన్‌లోకి తెచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రేమకథాచిత్రమ్‌తో అందమైన దెయ్యంగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నందితను కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. రీసెంట్‌గా ఈ అమ్మాయికి సంబంధించిన షూట్స్ చేశారు. ఒక న్యూస్ డైలీలో నందిత పనిచేస్తూ ఉందట. ఎన్టీఆర్‌కి సాయం చేసే క్యారెక్టర్స్‌లో ఒక క్యారెక్టర్‌గా నందిత కనిపించనుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా చిన్నదే అయినప్పటికీ కథకు చాలా చాలా అవసరమైన క్యారెక్టర్ అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ముందు ముందు జై లవకుశ యూనిట్ నుంచి ఇంకా ఎన్ని సర్‌ప్రైజ్ న్యూస్‌లు వస్తాయో చూడాలి మరి.

Related News

Comments

comments