షాకింగ్….సాహో టీజర్ వీడియో లీక్

సినిమా ఇండస్ట్రీని లీకుల వ్యవహారం సర్వనాశనం చేసేలా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత లీక్ అవ్వడం అంటే అర్థం చేసుకోవచ్చు. వందలాది థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఒకచోట లీక్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. కానీ సినిమాను రిలీజ్ చేయకముందే లీక్ అవడమేంటి. ఆల్రెడీ బాహుబలి-2 సినిమా సెన్సార్ బోర్డ్ నుంచి లీక్ అయిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాలో ఉన్న కంటెంట్‌కి సంబంధించి అఫిషియల్‌గా బయటికి రాని అవుట్ పుట్ లీకు వీరులకు ఎలా చేరింది అన్న విషయంపై రాజమౌళి టీం స్టడీ చేస్తోందట. అలాగే నెట్‌లో ఉన్న బాహుబలి-2 లీకేజ్ అవుట్ పుట్ ఎక్కడ ఉన్నా డిలీట్ చేసే పనిలో ఉన్నారట.

ఆ విషయం అలా ఉంటే బాహుబలి హీరో ప్రభాస్ నటించిన సాహో టీజర్ కూడా లీకయింది. ఆల్రెడీ ఈ టీజర్ వైరల్ అయింది. వాట్సాప్ గ్రూపుల్లో కూడా దర్శనమిస్తోంది. బాహుబలి స్థాయి గ్రాఫిక్స్ పార్ట్‌కి తోడు హై ఎండ్ యాక్షన్ కూడా సాహో టీజర్‌లో ఉంది. రక్తం ఏరులై పారుతున్న ఒక సీన్…..అప్పుడే అక్కడకి వచ్చిన విలన్…..‘ఆ రక్తం చూస్తుంటే మనవాళ్ళు వాడిని(హీరోని) ఏ రేంజ్‌లో కొట్టారో అర్థమౌతోంది’ అని అంటాడు. వెంటనే రియాక్ట్ అయిన విలన్ పక్కనున్న క్యారెక్టర్…..‘ఆ రక్తం వాడిది కాదన్నా …..మనవాళ్ళది……’ అని చెప్తాడు. విలన్ షాక్. ఆ డైలాగ్ వచ్చిన వెంటనే ప్రభాస్ కళ్ళు తెరుస్తాడు. ‘ఇట్స్ షో టైం….’ అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు ఈ టీజరే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకూ బాహుబలి గెటప్స్‌లో చూసిన ప్రభాస్….ఈ టీజర్‌లో యాక్షన్ హీరోగా కొత్తగా కనిపిస్తాడు. నెట్‌లో వైరల్ అవుతున్న ఈ టీజర్‌ని కూడా పూర్తిగా డిలీట్ చేసే పనిలో సాహో టీం ఉందట. అయితే ఇప్పటికే ఆలస్యమైందని తెలుస్తోంది. చాలా చిన్న వీడియోనే కావడంతో చాలా మంది షేర్లు చేసుకుని……సేవ్ చేసి పెట్టుకున్నారట. ముందు ముందు అయినా సినిమా వాళ్ళు లీకేజ్ వ్యవహారాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

More from my site

Comments

comments