షాకింగ్….విజయ్ దేవరకొండ ఆ సిఎం ఇంటి మనిషి

vijay-devara

ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ప్రేక్షకులకు టచ్‌లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ ‘పెళ్ళి చూపులు’ సినిమాతో ఏకంగా వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించేశాడు. ఆ ఒక్క సినిమా దెబ్బతో మనవాడి ఫేటే మారిపోయింది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ కుమారుడు కెటీఆర్‌తో పాటు ఎందరో ఇండస్ట్రీ పెద్దలు కూడా పెళ్ళిచూపులుకు ప్రమోషన్ చేసి పెట్టారు. ఇంత చిన్న సినిమా కోసం ఈ స్థాయి పెద్దలు ఎందుకు ముందుకు వచ్చారా అని అప్పట్లో చాలా మంది చర్చించుకున్నారు.

అయితే అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ హీరోగారు స్వయానా కెసీఆర్‌కి బంధువట. కెసీఆర్ కూతురు కవిత భర్తకు చాలా దగ్గర బంధువట విజయ్. అందుకే విజయ్‌ని హీరోగా నిలబెట్టడం కోసం కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోందట. స్వయానా మంత్రి కెటీఆర్‌గారే పెళ్ళి చూపులు సినిమా కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి…..విజయ్‌ని ప్రశంశల్లో ముంచెత్తడాన్ని చూసే ఉంటారు. ముందు ముందు ఈ హీరో స్థాయి ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్ళేలా ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా కల్వకుంట్ల ఫ్యామిలీతో ఆ స్థాయి బంధుత్వం ఉండి ఉంటే మాత్రం విజయ్ చాలా అదృష్టవంతుడి కిందే లెక్క. నెక్ట్స్ ఐదేళ్ళు కూడా తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సో…ఓ పదేళ్ళ పాటు మనవాడు కెరీర్‌ని అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. చూద్దాం…..విజయ్ కూడా నారా రోహిత్‌లా అవుతాడో…….లేక సూపర్ స్టార్ రేంజ్‌కి ఎదుగుతాడో? నారా రోహిత్‌కి కూడా చంద్రబాబు సపోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే నారా వారి అబ్బాయి మాత్రం స్టార్ స్టేటస్ కంటే కూడా తనకు నచ్చిన సినిమాలు ఏవో చూసుకుంటే మీడియం రేంజ్‌లోనే నిలబడిపోయాడు. మరి విజయ్…రోహిత్‌ని మించి ఎదుగుతాడేమో చూడాలి.

Related News

Comments

comments