బ్రతికున్న రిపోర్టర్ ను చంపేసిన సోషల్ మీడియా..!

కొద్దిరోజుల క్రితం ఓ పాకిస్తాన్ రిపొర్టర్ న్యూస్ చదువుతూ అలానే క్రేన్ మీద నుండి పడిపోయిన న్యూస్ తెలిసే ఉంటుంది. అది కవర్ చేసిన సోషల్ మీడియా ఆమె బ్రతికి ఉందా లేదా అన్న కన్ఫర్మేషన్ ఏమి లేకుండానే ఆమెను చంపేశారు. తీరా చూస్తే ఆమె పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు తెలిసి షాక్ అవుతున్నారు.

రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఆ వార్తలకు షాక్ అయ్యింది ఆ రిపోర్టర్. ఆ పాకిస్తాన్ లేడీ జర్నలిస్ట్ ఎవరో కాదు టివి 92 ఛానెల్ రిపోర్టర్. న్యూస్ కవర్ చేస్తున్న క్రమంలో ఉన్నపళంగా క్రింద పడటంతో ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆమె చనిపోయిందని కన్ఫాం చేశారు. అయితే తను ప్రాణాలతోనే ఉన్న విషయం ఆమె స్వయంగా ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఈ వార్త ముఖ్యంగా భారత దేశంలో ఎక్కువ ట్రెండింగ్ అవుతూ వచ్చింది. భారతీయులు తన మీద చూపించిన ప్రేమకు ఇర్జా ధన్యవాదాలు తెలిపింది. ఇక జూలై 30న తన పుట్టినరోజు అని అప్పటికి తనకు 23 సంవత్సరాలు నిండుతాయని చెప్పింది ఇర్జా.

More from my site

Comments

comments