మాస్ మహారాజ్ రవితేజ హీరోగా “సోగ్గాడే చిన్ని నాయనా” సీక్వెల్

మొదటి ప్రయత్నంలోనే కింగ్ నాగార్జున లాంటి స్టార్‌తో `సోగ్గాడే చిన్ని నాయ‌నా` చిత్రం తీసి మెప్పించారు క‌ళ్యాణ్ కృష్ణ‌. ఆ వెంట‌నే అక్కినేని హీరోతోనే, నాగ చైతన్య హీరోగా `రారండోయ్ వేడుక చేద్దాం` సినిమా చేసే అవ‌కాశం అందుకున్నాడు. తొలి రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టాయి.

సోగ్గాడే చిత్రానికి సీక్వెల్ క‌థ‌ను రాసుకుని నాగార్జునకి వినిపించాడు. అప్ప‌ట్లో బంగార్రాజు అనే టైటిల్ కూడా వినిపించింది. నాగార్జున ఈ సినిమాలో న‌టించేందుకు డిసైడ్ అయ్యారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నాగార్జున ఆ సినిమా చెయ్యనన్నాడట. అయితే ఇటీవ‌లే క‌ళ్యాణ్ కృష్ణ ఈ క‌థ‌నే మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌కు వినిపించ‌డట‌. ర‌వితేజ‌కు ఈ కథ బాగా న‌చ్చింద‌ట. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ లా కాకుండా ఓ కొత్త పంథాలో ఈ క‌థ‌ను మ‌లిచాడ‌ని.. అందుకే ర‌వితేజ‌కు తెగ న‌చ్చింద‌ని చెబుతున్నారు. ర‌వితేజ ప్ర‌స్తుతం `రాజా ది గ్రేట్‌`తో స‌క్సెస్ అందుకుని, ట‌చ్ చేసి చూడు చిత్రంలో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి క‌ళ్యాణ్ కృష్ణ‌తో సినిమా సెట్స్‌కెళ్లే ఛాన్సుంద‌ని చెబుతున్నారు.

More from my site

Comments

comments