స్పైడర్, జై లవకుశ పై చేయి ఎవరిదంటే….. (టోటల్ డీటెయిల్స్)

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. అటు ప్రీమియర్స్ ద్వారా యూఎస్ ని దడ దడ లాడించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించాడు. ట్రేడ్ వర్గాలే బెంబేలెత్తేలా అలజడి రేపాడు. తాము వేసిన అంచనాలకంటే తారక్ ప్రభంజనం సృష్టించాడని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మార్కెట్ ఇంతకుముందు కన్నా జై లవకుశ సినిమాతో మరింత పెరిగింది. ప్రీమియర్స్ తోనే జనతా గ్యారేజ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ జై లవ కుశతో దుమ్ముదులిపేశాడు. యూఎస్ బాక్సాఫీస్ పై ఎన్.టి.ఆర్ దండయాత్ర అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమా కచ్చితంగా ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుందని తెలుస్తూనే ఉంది. రిలీజ్ నాడే 50 కోట్ల గ్రాస్ తో కలక్షన్స్ ప్రభంజనం సృష్టించిన ఎన్.టి.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ 100 కోట్లు దాటింది. యూఎస్ లో 2 మిలియన్ డాలర్లకి అతి చేరువగా వచ్చింది.

స్పైడర్.. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన సినిమా. దర్శకుడిగా మురుగదాస్‌కు, హీరోగా మహేశ్‌కు ఉన్న స్టార్‌డమ్‌తో స్పైడర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలయిన ఈ సినిమా.. మిశ్రమ స్పందనను రాబట్టుకుంటోంది. రివ్యూల మాటెలా ఉన్నా, టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. యాక్షన్ థ్రిలర్‌గా మహేశ్ కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే స్పైడర్ కంటే జై లవకుశకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. జై లవకుశ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 48 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక స్పైడర్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 38 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఓవరాల్‌గా జై లవకుశ మొదటి రోజు కలెక్షన్ల విషయంలో పై చేయి సాధించిందన్నమాట.

More from my site

Comments

comments