సుక్కు-చరణ్ బేసిక్ స్టోరీ….నాన్నకు ప్రేమతో లైన్స్‌లోనే

ram-charan

రామ్ చరణ్-సుకుమార్‌ల సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మధ్య కాలంలో ఏ టాప్ రేంజ్ స్టార్ హీరో సిినిమా షూటింగూ జరగనట్టుగా చరణ్ సినిమా షూటింగ్ మన పల్లెల్లోనే జరుగుతుండడం గమనార్హం. మామూలుగా అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయినా సరే కనీసం పక్క రాష్ట్రాలకో….ఇక సిటీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే పక్క దేశాలకో వెళ్ళడం తెలుగు సినిమా స్టార్ హీరోల స్టైల్. కానీ సుకుమార్ మాత్రం ఈ సారి పూర్తి సహజత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆ విషయం చెప్పగానే చరణ్ కూడా వెంటనే ఒకే చేసేశాడు. అందుకే మన గోదావరి పల్లెసీమలను భారీ తెరపై….భారీ బడ్జెట్ సినిమాలో మరోసారి చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతోంది.

ఇక ఈ సినిమాలో తొంభైలనాటి ఒక స్వచ్ఛమైన పవిత్ర ప్రేమను చూపించబోతున్నాడు సుకుమార్. ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కూడా రివేంజ్ స్టోరీనే అని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమాలో నాన్నకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలను చూపించిన సుకుమార్……ఈ సారి మాత్రం అదే ప్రతీకారాన్ని ప్రేమ కోణంలో చూపిస్తున్నాడని తెలుస్తోంది. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం, తన ప్రేమకు అన్యాయం చేసిన వాడిపైన ప్రతీకారం తీర్చుకునే క్యారెక్టర్‌లో రామ్ చరణ్ కనిపిస్తాడట. ఆ రివేంజ్ సీన్స్ అన్నీ కూడా తమిళ్ సినిమాల స్టైల్‌లో రా గా ఉంటాయని చెప్తున్నారు. రామ్ చరణ్‌ చేత సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా ఆ ప్రతీకారం తాలూకూ సీన్స్‌లో యాక్ట్ చేయిస్తున్నాడట సుకుమార్. తెలుగు సినిమా లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం…..బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న చేత సుకుమార్ చాలా పెద్ద ప్రయోగమే చేయిస్తున్నట్టు లెక్క. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం సుకుమార్‌తో పాటు చరణ్‌కి కూడా చాలా మంచి పేరు రావడం ఖాయం. సుకుమార్ దర్శకత్వం, చరణ్ యాక్టింగ్…డిస్టింక్షన్ రేంజ్‌లో ఉండే ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనమూ కోరుకుందాం. అలా జరిగితే అయినా…. ఆ తర్వాత నుంచి మన హీరోలు ఊహల్లో ఉండే క్యారెక్టర్స్ చేయడం తగ్గించి…కాస్త సహజత్వానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేసే అవకాశం ఉంటుంది.

Related News

Comments

comments