డ్రగ్స్ రాకెట్….హీరోలను, ఇండస్ట్రీని షేక్ చేస్తోంది…కానీ ఆ హీరోకు భలే భలే కలిసొచ్చిందిట

వీపు మీద తంతే మూతి పళ్ళు రాలాయని ఓ గొప్ప సామెత ఉంటుంది తెలుగులో. అంటే ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో ఎవరికో ఏదో కలిసొస్తుందన్న అర్థం కూడా అందులో ఉంది. ఇప్పుడు తాజాగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న…..టాప్ రేంజ్ హీరోలను, ప్రొడ్యూసర్స్‌ని భయపెడుతున్న డ్రగ్స్ రాకెట్ ఒక హీరోకు మాత్రం భలే కలిసొస్తోంది. నాకు నేనే (తోపు…తురుము) అనే సినిమాతో ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న అశోక్ అనే యువ హీరోకు డ్రగ్స్ రాకెట్ ఎపిసోడ్ మొత్తం ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియా జనాలు ఇప్పుడు డ్రగ్స్ రాకెట్‌తో ముడిపెట్టి ‘నాకు నేనే’(తోపు, తురుము) అనే సినిమా పోస్టర్స్‌ని సెటైరికల్‌గా షేర్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ జనాలు కూడా చర్చించుకుంటున్నారు.

ఇంతకీ ఇంతలా చర్చనీయాంశమయ్యేంతలా ఆ సినిమాలో ఏం ఉంది అనుకుంటున్నారా? తొంభై శాతం చిన్న సినిమాల్లో లేని కంటెంట్ ఆ సినిమాలో ఉందని సెన్సార్ సభ్యులు కూడా సర్టిఫికెట్ ఇచ్చారట. ఆ స్థాయి కాన్సెప్ట్‌తో ‘నాకు నేనే’(తోపు,తురుము) సినిమా వస్తోంది మరి. ఇదేదో రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీనో కాదు, అలాగే బూతులు అమ్ముకోవడానికి వస్తున్న సినిమా కూడా కాదు. హిట్లర్ గురించి చార్లీ చాప్లీన్ తీసిన పొలిటికల్ సెటైర్ సినిమా తరహాలో నేటి నీచమైన పాలిటిక్స్‌పై సెటైరికల్ తరహాలో ఈ సినిమా తెరకెక్కింది మరి. మన నాయకులకు ఆల్ ఫ్రీ అనడం, ఆ తర్వాత గద్దెనెక్కడం, ఆ తర్వాత అన్నీ ఫ్రీగా దోచుకోవడం అలవాటేగా.
అందుకోసమే ఫ్రీ బియ్యం, రుణమాఫీ, ఫ్రీ సరుకులు అంటూ హామీలు ఇస్తూ ఉంటారు.

అసలు ఒక్క శాతం కూడా టెన్షన్ లేకుండా…..ప్రచారం కూడా చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా సిఎం కుర్చీని మన కాళ్ళ దగ్గరకు లాక్కొచ్చే హామీలు ఏంటో మీకు తెలుసా? ‘నాకు నేనే’ (తోపు, తురుము) హీరోకు తెలుసు మరి. అందుకే డ్రగ్స్ ఫ్రీ, లిక్కర్ ఫ్రీ…ఇంకా బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ, ఆ బలహీనతల కోసం పెళ్ళాం పుస్తెలు, బిడ్డల భవిష్యత్‌ని కూడా తాకట్టుపెట్టుస్తున్న మన ఓటర్లు ….ఇక అలాంటి బలహీనతలకు సంబంధించిన లిక్కర్, డ్రగ్స్….లాంటి వాటినన్నింటినీ ఫ్రీగా ఇస్తానంటే గెలిపించకుండా ఉంటారా? అదీ మన హీరో ధైర్యం. అందుకే నాకు నేనే తోపు తురుము అని చెప్పుకుంటూ ఎన్నికల్లో గెలిచేస్తాడట……ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్‌వాళ్ళ ప్రశంశలు కూడా లభించాయి. ఈ నెల 28న మనముందుకు రాబోతున్న ఈ తోపు తురుము రాజకీయ నాయకుడైన మన కథానాయకుడు అశోక్ ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి మరి.

More from my site

Comments

comments