తెలుగు టాప్ హీరో….ఆ టాప్ హీరోయిన్‌తో ప్రేమకు అడ్డు చెప్తున్నది ఎవరు?

top hero top heroine

హీరో, హీరోయిన్…ఇద్దరూ టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్ళే. తాజాగా రిలీజ్‌కి రెడీ అయిన సినిమాతో ఆ హీరో కూడా అగ్రపథంలో దూసుకుపోతున్నాడు. తెలుగులో ఏ హీరోకీ లేనంత పాపులారిటీ సంపాదించుకునేలానే ఉన్నాడు. ఇక ఆ హీరోయిన్ అయితే ఎప్పుడో నంబర్ ఒన్ అయింది. ఈ తరం తెలుగు హీరోయిన్స్‌లో ఎవరికీ దక్కనన్ని డిఫరెంట్ సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆ హీరోయిన్ సొంతం చేసుకుంది. గ్లామర్‌తోనూ, నటనతో కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇద్దరికీ కూడా పెళ్ళి ఏజ్ వచ్చేసింది. ఈ ఇద్దరి ప్రేమకథ గురించి ఇండస్ట్రీ జనాలకు కూడా తెలుసు.

ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఓ సినిమాలో వీళ్లిద్దరి ప్రేమకథకు సంబంధించిన సీన్స్ ఉంటాయి. అప్పట్లోనే బోలెడన్ని గుసగుసలు వినిపించాయి. ఆ అగ్రహీరోయిన్‌కి వేరే అగ్రహీరోకి ఇష్యూస్ వచ్చాయని, ఈ యువ హీరోతో ప్రేమలో ఉందన్నట్టుగా ఆ సినిమాలో చూపించాడు వర్మ. అఫ్కోర్స్…ఈ మధ్య కాలంలో వర్మ తీసిన అన్ని సినిమాల్లాగే అది కూడా డిజాస్టర్ అవ్వడంతో ఆ సినిమాలో ఉపకథగా చెప్పిన ప్రేమకథను కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. కాకపోతే ఆ సినిమా టైంలోనే ఈ ఇద్దరి ప్రేమ విషయానికి సంబంధించి మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇద్దరి నుంచీ నో ఆన్సర్. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నంతవరకూ పక్కాగా తెలుస్తున్న సమాచారం. ఇప్పుడు చేస్తున్న భారీ సినిమాలో ఆ హీరోయిన్‌కి ఆఫర్ రావడానికి ఆ అగ్రహీరోనే కారణం అన్నది ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ఆ హీరోయిన్‌తో డైరెక్టర్ చాలా ఇబ్బందులు పడ్డాడన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత కథాకమామిషు జరుగుతున్నా కూడా ఆ హీరో, హీరోయిన్లు ఎందుకు బయటపడడం లేదు? నాగచైతన్య, సమంతాల లవ్ స్టోరీ అయినా వాళ్ళకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చి ఉండాలి కదా? పెద్దల నుంచి ఏమైనా అభ్యంతరాలున్నాయా? లేక బెస్ట్ ఫ్రెండ్స్ అనే అనుకోవాలా? ఏది ఏమైనా అతి త్వరలోనే ఈ ఇద్దరి పెళ్ళి కాని హీరో, హీరోయిన్స్ పెళ్ళికి సంబంధించిన వార్తలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అన్ని ప్రశ్నలకూ సమాధానం అప్పుడే దొరికేలా ఉంది. వీళ్ళిద్దరే పెళ్ళి చేసేసుకుంటారో లేక ఇద్దరూ కూడా వేర్వేరు వ్యక్తులతో పెళ్ళిళ్ళు చేసుకుంటారో చూడాలి మరి. కానీ ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ ఇద్దరి మంచితనం గురించి చాలా చెప్తూ ఉంటారు. వ్యక్తులుగా ఇద్దరూ కూడా ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. చిన్నా పెద్దా అందరితో ఒకేలా కలిసిపోతారు. అస్సలు గర్వం లేదు. అలాంటి ఈ ఇద్దరు కలిస్లే కచ్చితంగా బెస్ట్ కపుల్ అవుతారనడంలో సందేహం లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related News

Comments

comments