టాలీవుడ్ డ్రగ్ స్టార్స్… దొరికినట్టే నా..?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం డ్రగ్స్.. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ మాయదారి భూతం..అటు మామూలు జానాన్ని…ఇటు సినీ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ….వారి కుటుంబాలను బజారు పాలు చేస్తుంది. ఈ డ్రగ్స్ వాడి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కొందరు అయితే…. డ్రగ్స్ వాడుతున్నవారితో స్నేహం వలన కేసుల్లో ఉన్న వారు కొందరు…ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ ఈ మాయా జగత్తులో పడి విలవిల్లాడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్ వ్యవహారం మీద సీరియస్ గానే ద్రుష్టి సారించి నగర పోలీస్ విభాగాన్ని…ఇంటెలిజెన్స్ వర్గాన్ని…డ్రగ్ కంట్రోల్ వ్యవస్థని అప్రమత్తం చేసినట్టు సమాచారం… నగర పోలీస్ వ్యవస్థ దీని మీద ఉక్కుపాదం మోపి…ఈ మాయదారి భూతాన్ని తరిమికొట్టే పనిలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమని జల్లెడ పడుతున్నారు…ఇందులో పరిశ్రమలో ముఖ్యంగా వినిపిస్తున్న కొందరి పేర్లు…ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి…పోలీస్ వారు ఇవ్వాళ జరిపిన సోదాల్లో బయటపడిన విషయాలు.

మాదకద్రవ్యాల కేసులో పట్టుబడిన కెల్విన్‌‌ను విచారిస్తున్న సమయంలో పోలీసులు సైతం నివ్వెర పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి…నాలుగేళ్ల క్రితమే కెల్విన్‌ సినీ పరిశ్రమపై కన్నేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కెల్విన్‌ కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా అతడితో సంబంధమున్న 19 మందికి నోటీసులు పంపగా అందులో 12 మంది ప్రముఖులు ఉన్నట్టు పోలీస్ వారు గుర్తించారు. వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించనున్నారు. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నోటీసులు పంపించిన వారందరినీ వారంపాటు విచారించనుంది. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ చార్మీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.

నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు..
రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, చార్మీ, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్,శ్యామ్ కే నాయుడు, చిన్నా, రవితేజ డ్రైవర్ – శ్రీనివాసరావు…తదితరులు….

డ్రగ్ కేసు – ఎవరిని ఎప్పుడు రమ్మన్నారు ?
తెలుగు చిత్ర పరిశ్రమలోని 12 మందికి నోటీసులు పంపిన సిట్, వారు విచారణకు ఎప్పుడు, ఎక్కడ హాజరు కావాలన్న విషయాన్ని స్పష్టంగా తెలిపింది.
ఈ పన్నెండు మందిలో 10 మందికి నోటీసులు వెళ్లినట్టు అక్నాలెడ్జ్ మెంట్ అందగా, మరో ఇద్దరికి ఈ ఉదయం నోటీసులు వెళ్లాయి.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజును 21వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య ఎక్సైజ్ కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న సిట్ ఆఫీసుకు రావాలని ఆదేశించారు.నవదీప్ ను 24వ తేదీ అదే ప్రాంతానికి రావాలని సూచించారు.దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మీ, ముమైత్ ఖాన్ లను 23న విచారణకు రావాలని ఆదేశించారు. చిన్నా, శ్యామ్ కే నాయుడులను కూడా 21వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. తరుణ్, రవితేజలను ఎప్పుడు విచారణకు పిలిచారన్న విషయమై సమాచారం వెలువడాల్సి వుంది.

More from my site

Comments

comments