సెన్సార్ బోర్డు చేయలేని పని ప్రధాని మోడీ చేసాడు.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన చారిత్రాత్మక జీఎస్టీ విధానం పై ఈ సినిమాలో ఉన్న డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  మోడీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్న ఆ డైలాగులను సినిమా లో నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మెర్సల్ చిత్రంలో హీరో విజయ్…జీఎస్టీ గురించి ”సింగపూర్ లో 7 శాతం జీఎస్టీ మాత్రమే ఉంది. అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. భారత్ లో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవు”  అనే డైలాగు చెప్పాడు. ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. అయినా మోదీ దెబ్బకు తీసివేయక తప్పలేదు. భారత్ లో మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానాన్ని అపహాస్యం చేసేలా ఆ డైలాగులున్నాయని బీజేపీ నేతలు బహిరంగంగానే ఖండించారు. జీఎస్టీ విధానాన్ని వక్రీకరించేలా ఆ డైలాగులున్నాయని…. వెంటనే ఆ డైలాగులను తొలగించాలని చిత్ర నిర్మాతలకు చెప్పారు. కేంద్రం నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయని వినికిడి. దీంతో చిత్ర నిర్మాత ఆ డైలాగులను తొలగించారు.

More from my site

Comments

comments