తమన్నా ‘ఆ’ సీన్స్‌ని తొలగించడానికి అసలు కారణం ఇదే!

‘బాహుబలి-2’ రిలీజ్‌కి ముందు మిల్కీబ్యూటీ తమన్నా వాయించుకున్న డప్పు చూసి.. ఆమె ఫ్యాన్స్ మురిసిపోవడంతో సినీజనాలు సైతం ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ పార్ట్‌లోలాగే రెండో భాగంలోనూ ఈ బ్యూటీ వీరవిహారం చేసి వుంటుందని భావించారు. పైగా.. ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తి ఫైట్ల కోసం శిక్షణ తీసుకుంది కాబట్టి.. తమన్నా విశ్వరూపం చూపిస్తుందని అనుకున్నారు. తీరా సినిమా రిలీజయ్యాక… అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తమన్నా చెప్పినట్లుగా ఆమె రోల్ చాలా పవర్‌ఫుల్‌గా కాదు కదా.. చెప్పుకోవడానిక్కూడా సిగ్గేస్తోంది. జస్ట్.. మూడంటే మూడు షాట్లలో కనిపించింది అంతే. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. సరిగ్గా ఒకటిన్నర నిముషం మాత్రమే. తమన్నా రోల్ ఇంత తక్కువే వుంటే.. రిలీజ్‌కి ముందు ఆ అమ్మడు ఎందుకు గొప్పగా చెప్పుకుంది? అనే సందేహాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టేశాయి.

తమన్నా, జక్కన్నల మధ్య ఏదో చిన్నపాటి గొడవ జరిగిందని.. అందుకు ప్రతీకారంగా ఆమె సీన్స్‌ని తొలగించేశారని జోరుగా ప్రచారం సాగింది. కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. మరి అసలు కారణం ఏంటా? అని ఆరాతీయడం మొదలుపెట్టగా.. అప్పుడు విషయం బయటపడింది. తమన్నాకి సంబంధించిన యాక్షన్ సీన్స్‌‌పై గ్రాఫిక్స్ వర్క్ చేసేందుకు మేకర్స్ ఒక కంపెనీకి అప్పగించారట. ఇతర సీన్లు వేరే కంపెనీలకు ఇచ్చారు. వాటి ఔట్‌పుట్స్ బాగానే వచ్చాయి కానీ.. తమన్నా సీన్స్ మాత్రం సరిగ్గా రాలేదు. సదరు కంపెనీ చేసిన సీజీ వర్క్ దారుణంగా వుండడంతో ఆమె సీన్స్‌ని తీసేయాల్సి వచ్చింది. పోనీ వేరే కంపెనీకి ఇద్దామంటే.. రిలీజ్ డేట్ దగ్గరలో వుంది. ఏం చేయాలో తెలీక చివరికి తమన్నా సీన్స్‌ని అర్థంతరంగా తీసేయాల్సి వచ్చిందని తెలిసింది. ఇదండి అసలు విషయం. పాపం తమన్నా.. ఈ సినిమాతో తన ఇమేజ్ మరింత పెరుగుతుందనుకుంటే, అభాసుపాలైంది.

More from my site

Comments

comments