ఆ స్టార్ హీరోయిన్ కి రూ.3 కోట్ల జరిమానా విధించారు.

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఈ ఏడాది ‘రాధ’.. ‘మిస్టర్’.. ‘యుద్ధం శరణం’ లాంటి డిజాస్టర్లు ఎదురయ్యాయి. లావణ్య తాజా చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఫలితం బాగానే ఉండేలా అనిపిస్తున్నా ఈ సినిమాలో ఆమె పాత్రకు ఏమంత మంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో లావణ్యకు మున్ముందు అవకాశాలు కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమెకు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం. తమిళ నిర్మాతల మండలి లావణ్యకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

తమిళంలో హీరో సందీప్ కిషన్ సరసన ‘మాయవన్’ అనే సినిమా చేసిన లావణ్య త్రిపాఠీ ఈ సినిమా తర్వాత ‘100 పర్సంట్ లవ్’ రీమేక్ కు కూడా ఓకే చెప్పింది. కానీ ఈ సినిమా నుంచి అనివార్య కారణాల వల్ల లావణ్య తప్పుకుంది. ఐతే ముందు కమిట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత లావణ్య షూటింగుకి హాజరు కాలేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ చిత్ర నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. ఈ కేసును పరిశీలించిన నిర్మాతల మండలి లావణ్యదే తప్పు అని తేల్చి.. ఆమెకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు కోలీవుడ్ మీడియా పేర్కొంది.

More from my site

Comments

comments