మూడో విడత రుణమాఫీ పథకం క్రింద రైతుల ఖాతాల్లో నగదు జమ: మంత్రి సోమిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ పధకం క్రింద మొదటి విడత 54.98 లక్షల రైతుల ఖాతాలకు రూ.7564.69 కోట్లు జమ చేయడం జరిగిందని, రూ.50,000 లోపు రుణమాఫీ పథకం అర్హత కలిగిన రైతులకు ఇందులో 23.76 లక్షల ఖాతాలకు రూ.4,493 కోట్లు జమ చేయడం జరిగిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. అలాగే రూ.50,000 పైబడి రూ.1,50,000 లోపల రుణమాఫీ పథకం అర్హత కలిగిన 31.22 లక్షల రైతుల ఖాతాలకు మొదటి వాయిదా రూ.3071.69 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
రెండవ విడత 36.39 లక్షల రైతుల ఖాతాలకు రూ.3300 కోట్లు విడుదల చేయడం జరిగిందని, దశల వారీగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 44 వేల అర్హత కలిగిన రైతు ఖాతాలకు రూ.96.25 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ముడో విడత వాయిదా క్రింద రూ.3600 కోట్లను 10% వడ్డీతో కలిపి బడ్జెట్‌లో పొందుపరిచి దీనిలో రూ.1000 కోట్లను రైతు సాధికార సంస్థ పీడీ  ఖాతాకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రూ.1600 కోట్లను అతి త్వరలో విడుదల చేయనున్నామని, ఈ నెల 10వ తేది నుండి  30వ తేదీ
 లోపల 31.22 లక్షల మంది రైతుల ఖాతాలకు ముడో విడత జమ చేయనున్నామని మంత్రి  తెలిపారు.

More from my site

Comments

comments