ఈ వారం ట్రేడ్ టాక్ః అంతా బాహు‘భళీ’నే…..ఆ ఒక్క సినిమా తప్ప 

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి వారం కూడా కనీసం రెండు మూడు సినిమాలు విడుదల కావడం ఆనవాయితీ. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా రిలీజ్‌లు మాత్రం ఓ స్థాయిలో ఉంటాయి. అందుకే థియేటర్స్ దొరకడంలేదో అన్న ఆక్రంధనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే అంతా కూడా సినిమా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే డ్రామాలు అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే బాహుబలి-2 సినిమా దెబ్బకు మాత్రం కనీసం మీడియాలో కూడా మిగతా సినిమాలకు ప్రాధాన్యత లేకుండా పోతోంది.

బాహుబలి-2 రిలీజ్‌కి ముందు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా మిస్టర్ థియేటర్స్‌కి వచ్చినప్పటికీ కనీస మాత్రం ప్రభావం కూడా చూపించలేకపోయింది. ఈ సినిమా దెబ్బకు శ్రీనువైట్ల ఇళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది అని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిర్మాతలకు వచ్చిన నష్టాల గురించి చాలా వార్తలే వస్తున్నాయి. ఆ వెంటనే బాహుబలి-2 థియేటర్స్‌లోకి వచ్చింది. ఇక అప్పటినుంచి బాహుబలి-2 మేనియానే కొనసాగుతుంది .ఒక తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం……ఓవర్సీస్….ఇలా అన్ని మార్కెట్స్‌లోనూ దున్నేస్తోంది బాహుబలి. ఇక ఈ వారాంతానికల్లా చారిత్రాత్మక వెయ్యి కోట్ల మార్క్‌ని కూడా చాలా ఈజీగా చేరుకుంది బాహుబలి-2. భారతీయ సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్ అన్నింటినీ భారీ తేడాతో బ్రేక్ చేసేసింది బాహుబలి-2. ఇక తర్వాత రాబోయే సినిమాలకు ఏ స్థాయి మార్జిన్‌ని లక్ష్యంగా నిర్ధేశిస్తుంది? ఈ కలెక్షన్స్ తుఫాన్ ఇంకా ఎన్ని వారాలు సాగుతుంది అన్నదొక్కటే ప్రశ్న.

బాహుబలి-2 కలెక్షన్స్ సునామీలో కూడా అవసరాల శ్రీనివాస్ లాంటి చిన్న హీరో ‘బాబు బాగా బిజీ’ అనే బూతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ తిరిగి పెవిలియన్‌కి వెళ్ళిపోవడానికి వచ్చినంత టైం కూడా పట్టలేదు. కనీస స్థాయి కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేక ఘోరంగా ఫ్లాప్ అయింది. హీరోయిన్స్ స్కిన్ షోతో నాలుగు డబ్బులు చేసుకుందాం అని దరిద్రంగా ఆలోచించి సినిమాలను తెరకెక్కించాలనుకునే నిర్మాతలకు దిమ్మ తిరిగే రేంజ్ షాక్ ఇచ్చింది బాబు బాగా బిజీ. ఇక బాహుబలి-2 సునామీని కూడా తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడ్డ సినిమా ఒక్కటే. అదే పవర్ పాండీ అనే తమిళ సినిమా. ధనుష్ దర్శకత్వంలో పందెం కోడి సినిమాలో విశాల్ తండ్రిగా నటించిన రాజ్ కిరణ్ హీరోగా వచ్చిన ఆ సినిమా మాత్రం బాహుబలి సునామీలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్సే రాబట్టుకుని సూపర్ హిట్‌గా నిలబడింది. సినిమాలో కంటెంట్, కాస్త కొత్తదనం ఉంటే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారని ఆ సినిమా చాటి చెప్పింది.

More from my site

Comments

comments