ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు జైలు శిక్ష

ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన జకీర్‌ అలీ త్యాగి అనే యువకుడు 42 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి కొందరు పోలీసులు ఇంటినుంచి తనను అరెస్టు చేసి తీసుకెళ్లారని బెయిల్‌పై వచ్చిన త్యాగి వెల్లడించాడు.

గంగానదికి ప్రాణముందన్న ప్రభుత్వ ప్రకటనను అపహాస్యం చేసిన త్యాగి.. రామమందిర నిర్మాణం జరుగుతుందన్న బీజేపీ వాగ్దానాన్ని సోషల్‌ మీడియాలో విమర్శించాడు. ఎయిరిండియాకు ఇచ్చిన హజ్‌ సబ్సిడీని ఎందుకు వెనక్కు తీసుకోలేదని, పలు ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. దీంతో ఈ యువకుడిపై ఐపీసీ 420 (చీటింగ్‌), ఐటీ చట్టాల కింద పోలీసులు చార్జిషీటు నమోదు చేశారు.

More from my site

Comments

comments