భూములు విక్రయించి, అప్పులు తీసుకొచ్చి.. రాజధాని నిర్మిస్తా: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కొద్ది సేపటి క్రితం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ఆలస్యం అయినా రాజీపడే ప్రసక్తే లేదని, మంచి డిజైన్ల కోసం అందరి సలహా తీసుకుంటామని అన్నారు. రాజధాని నిర్మాణం అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా ఉండాలంటే నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్లలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళిని డిజైన్లు కోరామని చంద్రబాబు తెలిపారు.

రాజధాని కోసం అప్పులు తీసుకొచ్చి, భూములు విక్రయించి, వివిధ సంస్థల ద్వారా నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం చేపడతామని సీఎం పేర్కొన్నారు. 2018 కల్లా మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టుతోపాటు సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్లను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ముఖ్యమంత్రికి చూపించినప్పటికీ అవి నచ్చకపోవడంతో డిజైన్ల కోసం మళ్లీ రాజమౌళిని సంప్రదించాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. అసలు సమస్య డిజైన్లది కాదు.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని గురించి కేంద్రమేమో పట్టించుకోవడంలేదు. అడగడానికి చంద్రబాబు దగ్గర ధైర్యం లేదు. ఇన్ని సమస్యల మధ్య రాజధాని నిర్మాణమెలా సాగుతుంది.?

 

More from my site

Comments

comments