టాలీవుడ్ బాద్ షా బీభత్సమైన రికార్డు

యూఎస్ లో ఎన్టీఆర్ వరుసగా నాలుగు సినిమాలు 1 మిలియన్ డాలర్లు కలెక్షన్లు రాబట్టి తెలుగు హీరోల్లో “ఒకే ఒక్కడిగా” నిలిచాడు. తాజాగా మూడు సినిమాలు అయితే ఏకంగా 1.5 మిలియన్ మార్క్ ను దాటి సరికొత్త చరిత్రను సృష్టించాడు. అవును… వరుసగా “నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ” చిత్రాలతో యుఎస్ మార్కెట్ లో 1.5 మిలియన్ అందుకున్న మొట్ట మొదటి దక్షిణాది హీరోగా తారక్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇకపోతే సీడెడ్ లో అయితే ‘జనతా గ్యారేజ్’తో తారక్ ఏకంగా రూ.10 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసేసి, ‘సీడెడ్‌కా బాద్‌షా’ అని పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ‘జై లవకుశ’తో కేవలం పదిరోజుల్లోనే ఆ క్లబ్‌లోకి ఎంటర్ అయిపోయి, ఆ ఏరియాలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం సీడెడ్‌లో మొత్తం 10 రోజుల్లో రూ. 10.10 కోట్లు కలెక్ట్ చేసింది. మరో విశేషం ఏమిటంటే.. దసరా కానుకగా విడుదలైన ‘స్పైడర్’, ‘మహానుభావుడు’ సినిమాలకంటే కూడా ప్రస్తుతం తారక్ సినిమాకే అక్కడ ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నిజానికి.. కొత్తగా వచ్చిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుకుంటాయి. రోజులు గడిచేకొద్దీ వసూళ్లు తగ్గుతూ వస్తాయి. కానీ.. ఇక్కడ రిజల్ట్ భిన్నంగా వుంది. కొత్తగా వచ్చిన సినిమాలకంటే వారంరోజుల వెనకాల వచ్చిన తారక్ చిత్రం బాక్సాఫీస్‌ని ఇంకా కుదిపేస్తూనే వుంది. దీన్ని బట్టి.. ఆ ఏరియాలో తారక్‌ క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

More from my site

Comments

comments