“టాలీవుడ్ టైగర్” ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ తోపాటు మరో స్టార్ హీరో కూడా…

‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ – ‘టాలీవుడ్  టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ ల కాంభినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభం ఆవుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ వేడుకకకు ఒక్క పవన్ కళ్యాణే కాదు, మరో బడా స్టార్ హీరో కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో పవన్ కు ఎలా అయితే సత్సంబంధాలు ఉన్నాయో, విక్టరీ వెంకటేష్ కు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే.

 

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబో ఎలాగో, త్రివిక్రమ్ రచయితగా ఉన్న కాలంలో వెంకీ – త్రివిక్రమ్ ల కాంబో కూడా అదే మాదిరి హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే సాన్నిహిత్యం ఉన్న విషయం పలు సినీ వేడుకల ద్వారా స్పష్టమైంది. దీంతో ఈ అనుబంధంతోనే విక్టరీ వెంకటేష్ కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు విచ్చేయనున్నారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తరపున అన్న నందమూరి కళ్యాణ్ రామ్ మరియు హరికృష్ణ హాజరు కానుండగా, త్రివిక్రమ్ తరపున పవన్ కళ్యాణ్ మరియు విక్టరీ వెంకటేష్ లు అతిధులుగా విచ్చేయనుండడంతో ఈ సినిమాపై హంగామా అప్పుడే ప్రారంభమైంది. ఈ సమాచారం తెలుసుకున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కాంబో అట్టహాసంగా ప్రారంభం కాబోతోందన్న మాట.

More from my site

Comments

comments