ఆ ఒక్క ఇబ్బంది లేకపోతే టార్గెట్ 4 పక్కా అంటున్న త్రివిక్రమ్, పవన్

pawan-trivikram

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి….క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల స్థాయిలో కాకపోయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చెక్కుడు బ్యాచ్‌కి చెందిన డైరెక్టరే. తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకూ కాంప్రమైజ్ అవ్వడు. సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు అందరూ కూడా తనకు నచ్చినవాళ్ళే ఉండాలి అని అనుకుంటాడు. అలాగే సీన్స్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. కానీ ఆ డిమాండ్స్ అన్నీ కూడా వేరే హీరోల విషయంలో. పవన్ దగ్గర మాత్రం ఒక్క డిమాండ్‌ని కూడా వినిపించడు త్రివిక్రమ్. పవన్ ఏం చెప్తే దానికి సై అంటాడు. అందుకే మామూలుగా అయితే ఒక సినిమాకు 9 నెలల టైం తీసుకునే త్రివిక్రమ్…ఈ సారి మాత్రం పవన్ బిజీ షెడ్యూల్‌ని దృష్టిలో పెట్టుకుని 4 నెలల్లో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆర్టిస్టుల విషయంలో కాంప్రమైజ్ అయ్యాడు. మామూలుగా అయితే టాప్ రేంజ్ హీరోయిన్స్‌తో తప్ప….అంతకంటే తక్కువ రేంజ్ హీరోయిన్స్‌తో ఇప్పటి వరకూ ఎప్పుడూ వర్క్ చేయలేదు త్రివిక్రమ్. అయితే ఈ సారి మాత్రం పవర్ స్టార్ లాంటి టాప్ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తున్నప్పటికీ ఇద్దరు హీరోయిన్స్‌ని కూడా చాలా చిన్న వాళ్ళనే తీసుకున్నాడు త్రివిక్రమ్. టాప్ హీరోయిన్స్ అందరితోనూ డేట్స్ సమస్యలు వచ్చాయి మరి.

ఇక ఈ సినిమా కోసం తీసుకున్న టెక్నీషియన్స్ అందరూ కూడా త్రివిక్రమ్ ప్లానింగ్‌కి తగ్గట్టుగానే వర్క్ చేస్తున్నారు. అయితే ఒకే ఒక్కరు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఆయనే తమిల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్. నిజానికి త్రివిక్రమ్ తీసిన ‘అ..ఆ’ సినిమాకు కూడా అనిరుథ్‌నే సంగీతం అందించాలి. కానీ అనిరుథ్ చాలా ఎక్కువ టైం అడగడంతో …అతన్ని తొలగించి మిక్కీని తీసుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఇఫ్పుడు పవన్ సినిమా విషయంలో కూడా అనిరుథ్ షెడ్యూల్‌కి తగ్గట్టుగా స్పందించడం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా అనుకున్న వెంటనే ముందుగా ఫైనల్ అయిన టెక్నీషియన్ అనిరుథ్ ఒక్కడే. త్రివిక్రమ్ కథ తనకు చాలా బాగా నచ్చిందని అనిరుథ్ కూడా చెప్పాడు. అయితే కథ చెప్పి చాలా నెలలే అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా కేవలం మూడు పాటలు మాత్రమే అందించాడు అనిరుథ్. ఇంకో రెండు పాటలు బేలన్స్ ఉన్నాయి. వాటి విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నాడట. ఇక పాటల విషయమే ఇలా ఉంటే రేపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకా ఎంత ఎక్కువ టైం తీసుకుంటాడో అని ఆలోచిస్తున్నాడట త్రివిక్రమ్. మామూలుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు అనిరుథ్. ఇక తెలుగులో ఫస్ట్ సినిమా….అది కూడా పవర్ స్టార్ లాంటి సూపర్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో సినిమా అంటే ఇంకా ఎక్కువ టైమే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయమే త్రివిక్రమ్‌ని టెన్షన్‌ పెడుతోందట. అనుకున్నట్టుగా నాలుగు నెలల్లో సినిమా రిలీజ్ చేయాలంటే షూటింగ్ ఇంకాస్త ముందుగానే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మరి అప్పుడైనా అనిరుథ్ టైంకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసి రిలీజ్ డిలే అవకుండా చూస్తాడేమో చూడాలి. పవన్ సినిమా మాత్రం ఈ సినిమా రిజల్ట్‌తో అందరికీ సమాధానం చెప్పాలన్న కసితో సినిమా కోసం క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నారు.

Related News

Comments

comments